ఫైనల్ గా మంచు విష్ణు ప్రతిష్టాత్మక చిత్రం కన్నప్ప ఓటిటీ లోకి వచ్చేస్తుంది. ఈ సంవత్సరం జూన్ లో రిలీజ్ ఐన ఈ చిత్రం సెప్టెంబర్ 4, 2025న ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది.
సాధారణంగా కొత్త సినిమాలు విడుదలైన కొన్ని వారాల్లోనే OTTలకు వస్తుంటాయి. అయితే కన్నప్ప మాత్రం ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో ఎన్నో ఊహాగానాలు చెలరేగాయి. ఇండస్ట్రీలో వినిపించిన సమాచారం ప్రకారం, విష్ణు అధిక ధరను కోరడంతో ప్రముఖ OTT సంస్థలు వెనకడుగు వేస్తున్నాయని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు వాటన్నింటికీ తెరపడింది.
విష్ణు స్వయంగా X.comలో పోస్ట్ చేస్తూ ఇలా తెలిపారు:
“త్యాగం, భక్తి, దివ్యత్వం అనుభవించండి. #KANNAPPA సెప్టెంబర్ 4, 2025 నుంచి కేవలం Prime Videoలో మాత్రమే స్ట్రీమింగ్.”
భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రముఖ తారల అతిథి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రభాస్ రుద్రుడిగా, అక్షయ్ కుమార్ పరమశివుడిగా, కాజల్ అగర్వాల్ పార్వతీదేవిగా, మోహన్‌లాల్ కిటారాగా నటించారు. అంతటి స్టార్ పవర్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
కన్నప్ప పాత్రలో విష్ణు తనదైన స్టైల్‌లో ఆకట్టుకోగా, హీరోయిన్‌గా ప్రీతి ముఖుందన్ ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు.
థియేటర్స్‌లో నిరీక్షించిన స్థాయి విజయం సాధించకపోయినా, ఇప్పుడు OTT రిలీజ్‌తో మరింత విస్తృతమైన ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం కన్నప్పకు దక్కింది.