హను-మాన్ వంటి గొప్ప విజయం తర్వాత తేజ సజ్జ హీరోగా భారీ అంచనాల రూపొందుతోన్న చిత్రం మిరాయ్. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సింగిల్స్ ఈ సినిమాపై హైప్ ని పెంచేశారు.
అయితే టీజర్ రిలీజ్ అయిన దగ్గరినుండి, శ్రీరాముడి పాత్రను మహేశ్ బాబు ఫీచర్స్ ఆధారంగా AI ద్వారా రూపొందించారన్న ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ రూమర్లకు యంగ్ హీరో తేజ సజ్జ ముగింపు పలికాడు. “అలాంటిదేమి జరగలేదని, అలాంటి ఆలోచన కూడా ఎవరూ చేయలేదు” అని తేజ స్పష్టం చేశాడు.
సినిమా టైటిల్ వెనుక అర్థాన్ని వివరించిన తేజ, “మిరాయ్ అంటే ‘భవిష్యత్తుకు ఆశ’ అని అర్థం. ఇంకా ఒక ప్రత్యేకమైన అర్థం కూడా ఉంది. అది మాత్రం సినిమా చూసినప్పుడు ఆడియన్స్‌కి సర్ప్రైజ్ అవుతుంది” అని తెలిపారు.
శ్రీరాముడి పాత్ర గురించి మాట్లాడుతూ, “కథలో ఒక ముఖ్యమైన సమయంలో శ్రీరాముడి యాంగిల్ వస్తుంది. అది ఆడియన్స్‌కి పవర్‌ఫుల్ హై ఇస్తుంది. ఇంకా సినిమాలో చాలా సర్ప్రైజ్‌లు ఉంటాయి” అని చెప్పారు.
తన బ్లాక్‌బస్టర్ హనుమాన్తో పోలికలపై స్పందిస్తూ, తేజ “హనుమాన్ అనేది అంజనాద్రి అనే ఫాంటసీ వరల్డ్‌లో సాగే కథ. కానీ మిరాయ్ అనేది అనేక దేశాల్లో సాగే కథ. క్యారెక్టర్స్, స్టోరీటెల్లింగ్ పరంగా పూర్తిగా భిన్నం” అని తెలిపారు.
కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తేజ సజ్జా హీరోగా నటిస్తుండగా, రితికా నాయక్ హీరోయిన్‌గా కనిపించనుంది. మిరై సెప్టెంబర్ 12, 2025న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.