సినిమా వార్తలు

కార్తి బర్త్‌డే స్పెషల్: రగ్గడ్ లుక్ లో ‘సర్దార్ 2’ పోస్టర్ అదుర్స్!

Published by
Rahul N

బ్లాక్‌బస్టర్ హిట్ సర్దార్కి సీక్వెల్‌గా వస్తోన్న సర్దార్ 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పిఎస్ మిత్రన్ ఈ సీక్వెల్‌ను కూడా డైరెక్ట్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో, హ్యుజ్ స్కేల్‌లో ప్రిన్స్ పిక్చర్స్ నిర్మిస్తోంది.

ఈ రోజు హీరో కార్తి పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. గన్ పట్టుకొని మ్యాసివ్ మిషన్‌లో కార్తి రగ్గడ్ లుక్‌లో దర్శనం ఇచ్చాడు. ఈ పోస్టర్ చూస్తే సినిమాలో ఆయన పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో స్పష్టంగా అర్థమవుతుంది. సోషల్ మీడియాలో ఇప్పటికే ఇది వైరల్‌గా మారింది.

ఈ సినిమాలో మాళవిక మోహన్, ఆషికా రంగనాథ్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య ఓ ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నాడు.

సాంకేతికంగా సర్దార్ 2కి టాప్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు:

  • సంగీతం: యువన్ శంకర్ రాజా
  • ఛాయాగ్రహణం: జార్జ్ సి. విలియమ్స్
  • స్టంట్స్: దిలీప్ సుబ్బరాయన్
  • ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
  • ప్రొడక్షన్ డిజైన్: రాజీవ్ నంబియార్

ఎ. వెంకటేష్ సహనిర్మాతగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. AP పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నారు.

సర్దార్ 2 థ్రిల్, యాక్షన్, ఎమోషన్‌తో ఫుల్ ప్యాక్‌గా ఉండబోతోంది. పోస్టర్ చూస్తుంటే ఈ సీక్వెల్‌కు మరింత భారీ అంచనాలు నెలకొంటున్నాయి!

Rahul N