సినిమా వార్తలు

కన్నప్పలో ప్రభాస్ రోల్ పై అదిరిపోయే అప్డేట్

Published by
Srinivas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ మధ్య కాలంలో వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయన కథానాయకుడిగా నటిస్తున్న సినిమాలకే కాకుండా, ఓ సినిమాలో గెస్ట్ రోల్‌ ద్వారా కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. అదే చిత్రం “కన్నప్ప”.

ఈ చిత్రం మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. మహాభారతం సీరియల్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ముకేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల స్టార్ నటులు భాగమవుతుండగా, అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అయితే ఇందులో ప్రభాస్ పాత్ర అసలు హైలైట్ కానుంది. మొదట ఇది ఓ చిన్న క్యామియోగా అనుకోగా, ఆ తర్వాత అది గెస్ట్ రోల్‌గా మారింది. సమాచారం ప్రకారం, ప్రభాస్ ఈ చిత్రంలో సుమారు 30 నిమిషాలపాటు స్క్రీన్‌పై కనిపించనున్నాడు.

ఇంతే కాకుండా, మోహన్ బాబు – ప్రభాస్ మధ్య పవర్ఫుల్ సన్నివేశాలు కూడా ఉన్నాయని మంచు విష్ణు స్వయంగా వెల్లడించాడు. ఇది అభిమానులకు మామూలు ఎక్సైట్మెంట్ కాదు. “రుద్ర” అనే పేరుతో ప్రభాస్ కనిపించనున్న ఈ పాత్ర మాస్, పవర్, స్టైల్ అన్నీ కలగలిసిన డైనమైట్‌లా ఉంటుందని టాక్.

ఇక అభిమానుల మాటలంటే, ఇది కేవలం గెస్ట్ రోల్ కాదుగా… బిగ్ మాస్స్ ట్రీట్ అన్నమాట! “కన్నప్ప” విడుదలయ్యేలోగా ప్రభాస్ పాత్ర చుట్టూ మరింత హైప్ పెరగడం ఖాయం.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts