నారా లోకేష్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుంటూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారు. ఇదే క్రమంలో పార్టీలో ఆయన కీలక పదవి చేపట్టే అవకాశం ఉందంటున్నారు. మరీ ముఖ్యంగా కార్యకర్తలంతా లోకేష్ కు, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ లోకేష్ అద్భుతంగా తన విధుల్ని నిర్వర్తిస్తున్నారని, ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడానికి ఇదే సరైన సమయం అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. పైగా మహానాడు జరుగుతున్న నేపథ్యంలో, మహానాడు వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తే, మరింత ఘనంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
ఇదే విషయాన్ని మంత్రి నిమ్మల రామానాయుడు కూడా బయటపెట్టారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు చంద్రబాబు రాత్రిపగలు కష్టపడుతున్నారని, ప్రభుత్వ కార్యక్రమాల్లో చంద్రబాబు బిజీగా ఉన్నందుకు, పార్టీ వ్యవహారాలు లోకేష్ లాంటి యువనాయకుడికి అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. అయితే ఈ మహానాడు వేదికగా అది జరుగుతుందా జరగదా అనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది.