Download App

‘L2: ఎంపురాన్’కు రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ – తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఆసక్తి!

మార్చి 26, 2025 By Rahul N
మోహన్‌లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘L2: ఎంపురాన్’ 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలోనే కొత్త రికార్డులు...
‘L2: ఎంపురాన్’కు రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ – తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఆసక్తి!

మోహన్‌లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘L2: ఎంపురాన్’ 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈ సినిమా మలయాళ సినీ పరిశ్రమలోనే కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. ఓపెనింగ్ డేకి రూ. 35 కోట్ల పైగా, మొదటి వీకెండ్‌కు రూ. 50 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడం విశేషం.

తొలుత తెలుగు వర్షన్ బుకింగ్స్ సాధారణంగా ప్రారంభమైనా, ప్రస్తుతం టికెట్ అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి. దాంతో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్ నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘L2: ఎంపురాన్’కు రికార్డ్ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ – తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఆసక్తి!

ఈ సినిమా భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడడానికి ప్రధాన కారణం శక్తివంతమైన విజువల్స్, పృథ్విరాజ్ సుకుమారన్ నేతృత్వంలో జరుగుతున్న అగ్రెసివ్ ప్రమోషన్లు. ఇక తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) అందుబాటులోకి తీసుకురానుంది.

ఈ చిత్రంలో మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించగా, పృథ్విరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, అభిమన్యు సింగ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటివరకు నమోదైన రికార్డు స్థాయి ప్రీ-సేల్స్, భారీ అంచనాల నేపథ్యంలో ‘L2: ఎంపురాన్’ బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్ దిశగా దూసుకెళ్లనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి!

మరిన్ని వార్తలు

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading