
మెగా పవర్ స్టార్ Ram Charan, Janhvi Kapoor జంటగా నటిస్తున్న తాజా చిత్రం Peddi. గ్రామీణ క్రీడల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు Buchi Babu Sana దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే గ్లింప్స్, ట్రైలర్, పాటలతో హైప్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ‘హల్లల్ల ల్లో’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఈ పాటలో Shruti Haasan ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, Ram Charan, Janhvi Kapoorతో కలిసి ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో అదరగొట్టింది.

ప్రోమో చూస్తుంటే ఇది పూర్తి స్థాయి మాస్ బీట్ సాంగ్‌గా నిలవనుందని అర్థమవుతోంది. ఫాస్ట్ పేస్డ్ కంపోజిషన్‌తో సంగీత దిగ్గజం A. R. Rahman మరోసారి తన మ్యాజిక్ చూపించినట్లు కనిపిస్తోంది. గాయని Rakshita Suresh ఆలపించిన ఈ పాటకు Anantha Sriram క్యాచీ లిరిక్స్ అందించారు.
‘హల్లల్ల ల్లో’ పూర్తి పాటను రేపు భోపాల్‌లో నిర్వహించనున్న భారీ మ్యూజికల్ ఈవెంట్‌లో విడుదల చేయనున్నారు. ఈ ఈవెంట్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ ఉత్సాహం కనిపిస్తోంది.
Peddi చిత్రంలో Shiva Rajkumar, Divyenndu Sharma, Jagapathi Babu, Boman Irani తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. Vriddhi Cinemas నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
