అశు రెడ్డి – బిగ్ బాస్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ సోషల్ మీడియా స్టార్, తరచూ తన బోల్డ్ ఫోటోషూట్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది.
తాజాగా అశు రెడ్డి తన కుడి ఛాతి భాగంలో వేసుకున్న టాటూ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ టాటూలో ఉన్న పేరు ఎవరిదో కాదు, తన ఐకాన్, తన అభిమాన దేవుడు – జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ది. అశు తన అభిమానాన్ని చూపించడానికి పవన్ కళ్యాణ్ పేరు టాటూగా వేసుకోవడం ప్రత్యేకంగా మారింది.
అయితే ఈ పోస్ట్ పై ఇంస్టాగ్రామ్ లో వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. “నేను అర్జెంట్ గా టాటూ ఆర్టిస్ట్ అయిపోతా…” అని ఒకరు, “టాటూ వేసినోడు అదృష్టవంతుడు మావా…” అంటూ మరొకరు, ఇలా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆ టాటూని అశు రెడ్డి రివీల్ చేసింది. తన పుట్టిన రోజు కూడా ఈ నెలలోనే ఉండటం విశేషం.
చిన్న పాత్రలతో సినిమాల్లో కనిపించిన ఆమె, చల్ మోహన్ రంగ, యేవం వంటి మూవీల్లో నటించింది. అయితే, నిజమైన పాపులారిటీ బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారానే వచ్చింది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షలకుపైగా ఫాలోవర్లు అశు రెడ్డి ఉన్నారు.
ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు అంకితమిచ్చిన ఈ టాటూ రివీల్, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్‌లో కొత్త చర్చకు దారి తీస్తోంది. అభిమానులు ఆమెను పవర్ స్టార్‌పై చూపించిన ఈ అభిమానం కోసం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.