కన్నప్ప సినిమా హార్డ్ డిస్క్ మాయమైన సంగతి తెలిసిందే. ఇది కేవలం చోరీ కాదని, ఇదొక వెన్నుపోటు చర్య అని అన్నాడు హీరో మంచు విష్ణు. హార్డ్ డిస్క్ చోరీ జరిగి 4 వారాలు అయిందని, పోలీసులు విచారణ సాగిస్తున్నారని స్పష్టం చేశాడు.
హార్డ్ డిస్క్ లో ఏమున్నాయో కూడా బయటపెట్టాడు విష్ణు. సినిమాకు సంబంధించి 90 నిమిషాల ఫూటేజ్ ఆ హార్డ్ డిస్క్ లోనే ఉందంట. కీలకమైన ఇద్దరు నటులకు సంబంధించి సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్స్ అందులోనే ఉన్నాయంటున్నాడు.
ముంబయిలోని హైవ్ స్టుడియోస్ నుంచి హార్డ్ డిస్క్ వచ్చిన మాట వాస్తవమేనని, కానీ తమ సంస్థతో ఏమాత్రం సంబంధంలేని చరిత అనే మహిళ, ఆ హార్డ్ డిస్క్ ను చోరీ చేసిందని ఆరోపించారు విష్ణు. నిజానికి ఇది దొంగతనం కాదని, వెన్నుపోటు అని అన్నారు.
కన్నప్ప సినిమా రిలీజ్ అడ్డుకోవడానికి ఎవరో ఈ పని చేసి ఉంటారని అనుమానిస్తున్నాడు విష్ణు. ప్రమాదవశాత్తూ హార్డ్ డిస్క్ లో కంటెంట్ బయటపడితే ఎవ్వరూ ప్రసారం చేయొద్దని కోరుతున్నాడు విష్ణు.