ఆంధ్ర ప్రదేశ్

కడపను అభివృద్ధి చేసే బాధ్యత నాది

Published by
Rahul N

కడప జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కడపలో జరిగి మహానాడులో మాట్లాడిన చంద్రబాబు.. గతంలో ఎన్నడూ లేనంత గొప్పగా మహానాడు జరిగిందన్నారు. నేతలు, కార్యకర్తల్లో పట్టుదల కనిపిస్తోందని, చర్చలు అర్థవంతంగా జరిగాయని అన్నారు.

పేదల ఇళ్లకు వెళ్లి కప్పు కాఫీ తాగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని వివరించాలని.. సిలిండర్, గ్యాస్ మనమే ఇచ్చామని చెప్పే బాధ్యత తీసుకోవాలని శ్రేణులకు సూచించారు చంద్రబాబు. ఈ సందర్భంగా కడప ఉక్కు ఫ్యాక్టరీపై స్పందించారు.

“కడప ఉక్కు కర్మాగారం పనులు 10 రోజుల్లో మొదలవుతాయి. జిందాల్ తో మాట్లాడాను. తొలి దశలో రూ.4,500 కోట్లు, రెండో దశలో రూ.4,500 కోట్లతో చేపడతారు. మొత్తం రూ.9 వేల కోట్లతో 3 ఎంటీపీఏ సామర్థ్యంతో నిర్మిస్తారు. దీనిద్వారా 3 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన చేశాం. వైకాపా హయాంలో మరోసారి శంకుస్థాపన చేసినా.. చివరకు ప్రాజెక్టు లేకుండా చేశారు. జూన్ 12 లోపు వచ్చి కొబ్బరికాయ కొట్టి పనులు మొదలు పెడతాం. మళ్లీ నేనే వచ్చి ప్రారంభిస్తాను.”

బద్వేలు నుంచి నెల్లూరు వరకు రూ.3,700 కోట్లతో రోడ్డు నిర్మాణానికి కేంద్రం అనుమతిచ్చిందన్నారు. త్వరలోనే ఈ పనులు కూడా మొదలుపెడతామని హామీ ఇచ్చారు.

Rahul N

Recent Posts