Download App

‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’.. తేజ సజ్జా మరోసారి జాంబీ ప్రపంచంలోకి!

ఆగస్ట్ 23, 2026 • By Srinivas
‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి వరుస విజయాలతో సూపర్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా మరోసారి జాంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీ రెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ – Dead...
‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’.. తేజ సజ్జా మరోసారి జాంబీ ప్రపంచంలోకి!

‘హనుమాన్’, ‘మిరాయ్’ వంటి వరుస విజయాలతో సూపర్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తేజ సజ్జా మరోసారి జాంబీ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ‘జాంబీ రెడ్డి’ ఫ్రాంచైజీలో రెండో భాగాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ – Dead Or Alive’ అనే టైటిల్‌ను వెల్లడిస్తూ విడుదల చేసిన గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

తెలుగు సినిమాకు జాంబీ జానర్‌ను పరిచయం చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ఓటీటీ ప్రాజెక్టులతో గుర్తింపు తెచ్చుకున్న సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ సినిమాను మరింత ఇంటెన్స్ యాక్షన్‌తో తెరకెక్కిస్తున్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మిరాయ్’ తర్వాత తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా, బాలీవుడ్ నటి షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

రివర్స్ ఆర్డర్‌లో అదిరిపోయిన గ్లింప్స్

మేకర్స్ విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌ను పూర్తిగా రివర్స్ ఆర్డర్‌లో ఆసక్తికరంగా రూపొందించారు. ఈ వీడియోలో ఎలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించలేదని ప్రారంభంలోనే స్పష్టం చేశారు.

ఫ్లైఓవర్‌పై నుంచి ఓ జాంబీ ట్రక్కుపై పడటంతో గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ‘Zombies are back’ అనే క్యాప్షన్‌తో జాంబీ ప్రపంచం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ హింట్ ఇచ్చారు. అనంతరం హీరో డ్రైవ్ చేస్తున్న కారు నుంచి ఆ జాంబీ పడిపోయిందని, చుట్టూ ఉన్న జాంబీలు దానిపై దాడి చేస్తున్నారని చూపించారు.

ఆ తర్వాత యాక్షన్ సీక్వెన్స్ హైదరాబాద్‌లోని చార్మినార్‌కు మారుతుంది. చేతిలో బ్యాట్ పట్టుకుని కారుపై నిల్చున్న తేజ సజ్జా భారీ సంఖ్యలో ఉన్న జాంబీలతో పోరాడుతూ కనిపించారు. “This time, next level” అంటూ ఆయన చెప్పడంతో ‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’ టైటిల్‌ను రివీల్ చేశారు.

టైటిల్ లోగోను కూడా వీడియో గేమ్ జాయ్‌స్టిక్ తరహాలో, జాంబీ చేతితో డిజైన్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్లింప్స్ చూస్తే మొదటి భాగంతో పోలిస్తే ఈసారి జాంబీ ప్రపంచాన్ని మరింత భారీ స్థాయిలో, ఎక్కువ యాక్షన్‌, విజువల్ స్పెక్టకిల్‌తో చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.

భారీ సాంకేతిక బృందం

‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలకు తేజ సజ్జాతో కలిసి పనిచేసిన గౌరహరి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలంగాణ జానపద ట్యూన్‌ను రాక్ ఎలిమెంట్స్, జాంబీ థీమ్ సౌండ్స్‌తో మిక్స్ చేసిన విధానం గ్లింప్స్‌కు ప్రత్యేకమైన ఎనర్జీని తీసుకొచ్చింది.

అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బంగ్లాన్ ప్రొడక్షన్ డిజైన్, విజయ్ వెలుకుట్టి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హుస్సేన్ దలాల్, అబ్బాస్ దలాల్, ప్రశాంత్ వర్మ, సుపర్ణ్ ఎస్. వర్మ కలిసి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సుబ్బు కె. డైలాగ్స్ రాశారు.

గ్లింప్స్‌ను బట్టి చూస్తే ‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్’లో కథ, యాక్షన్, విజువల్స్, స్కేల్ అన్నీ మరింత భారీగా ఉండనున్నాయి. ‘బిగ్గర్, బ్యాడర్, బ్లడియర్’ అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా జాంబీ జానర్‌లో మరో ఆసక్తికరమైన ప్రయత్నంగా నిలిచే అవకాశముంది.

‘జాంబీ రెడ్డి 2 నెక్స్ట్ లెవెల్ – Dead Or Alive’ 2027లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading