Download App

నాని ‘ది ప్యారడైజ్’ – అదిరిపోనున్న యాక్షన్ గ్లింప్స్

ఆగస్ట్ 12, 2025 • By Srinivas
నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ చేయని ఒక ఇంటెన్స్ & ఫెరోషియస్ క్యారెక్టర్‌తో రాబోతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్లోబల్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ ఇప్పటికే...
నాని ‘ది ప్యారడైజ్’ – అదిరిపోనున్న యాక్షన్ గ్లింప్స్

నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ చేయని ఒక ఇంటెన్స్ & ఫెరోషియస్ క్యారెక్టర్‌తో రాబోతున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్లోబల్ యాక్షన్ డ్రామా ది ప్యారడైజ్ ఇప్పటికే సినీ ప్రేమికుల్లో విపరీతమైన హైప్ క్రియేట్ చేసింది. రెండు ఫస్ట్-లుక్ పోస్టర్లతోనే రా & పవర్‌ఫుల్ స్టేట్‌మెంట్ ఇచ్చిన ఈ చిత్రం, తాజాగా విడుదల చేసిన బిహైండ్-ది-సీన్స్ ‘స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్’ గ్లింప్స్‌తో మరోసారి సంచలనం సృష్టించింది.

జైలు వాతావరణంలో సాగే పవర్‌ప్యాక్ యాక్షన్

రామోజీ ఫిల్మ్ సిటీలో 15 రోజులపాటు షూట్ చేసిన హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీక్వెన్స్ గ్లింప్స్‌లో నాని పాత్ర మాస్ ఎఫెక్ట్ చూపించింది. కత్తులు పట్టుకున్న ఖైదీలు చుట్టుముట్టినా, చేతిలో ఏ ఆయుధం లేకుండా సీట్లో కూర్చొని, ఒక్క చూపుతో వారిని సవాలు చేసే నాని ఆట్టిట్యూడ్ ఫుల్‌గా కనెక్ట్ అయ్యేలా ఉంది.

రఫ్ & టఫ్ లుక్

రెండు జడలు, ముఖం మీద గాట్లు, రఫ్-అండ్-టఫ్ గెటప్‌లో నాని పూర్తిగా మారిపోయారు. చుట్టూ కలకలం జరుగుతున్నా, కూల్‌గా కూర్చొని గుంపును గమనించే ఆ సీన్ ఫెరోషియస్ వైబ్ ఇస్తోంది.

దర్శకుడి బోల్డ్ విజన్ – టాప్ నాచ్ ప్రొడక్షన్

శ్రీకాంత్ ఓదెల ప్రతీ ఫ్రేమ్‌లో తన విజువల్ స్టైల్‌ని, క్యారెక్టర్ డిజైన్‌లోని బోల్డ్‌నెస్‌ని రుజువు చేశారు. సుధాకర్ చెరుకూరి నిర్మాణ విలువలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి.

అనిరుధ్ మ్యూజిక్ – పుల్స్ పెంచే స్కోర్

రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ రా & రియలిస్టిక్ టోన్‌ని నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. ప్రతీ ఫ్రేమ్‌కి థ్రిల్‌ను జోడించి, యాక్షన్ ఇంపాక్ట్‌ను మాక్సిమమ్‌గా పెంచింది.

బలమైన క్యాస్ట్ – పాన్ వరల్డ్ రిలీజ్

బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. కథలో బలమైన పాత్రల సమ్మేళనం, విజువల్ స్పెక్టకిల్, స్ట్రాంగ్ కంటెంట్ – ఈ మూడు కలిసి ది ప్యారడైజ్ను 2026లో అత్యంత ఎదురు చూస్తున్న యాక్షన్ డ్రామాగా నిలిపాయి.

మార్చి 26, 2026న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. భారతీయ సినిమాకు గ్లోబల్ లెవెల్‌లో కొత్త గుర్తింపు తీసుకురావడమే లక్ష్యంగా మేకర్స్ ముందుకు వెళ్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading