Download App

నో డౌట్… ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘God of War’ షూటింగ్ అప్పటినుండే…

అక్టోబర్ 13, 2025 By Rahul N
ప్రస్తుతం ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ మూవీ షూటింగ్లో బిజీ గా ఉండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) వెంకటేష్ (Venkatesh)తో చేస్తున్న మూవీ పనుల్లో ఉన్నారు. కాగా త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కంటే ముందుగా ఎన్టీఆర్ తో మూవీ అనుకున్నారు. చిత్రం టైటిల్...
నో డౌట్… ఎన్టీఆర్ – త్రివిక్రమ్ 'God of War' షూటింగ్ అప్పటినుండే…

ప్రస్తుతం ఎన్టీఆర్(NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో డ్రాగన్ మూవీ షూటింగ్లో బిజీ గా ఉండగా, త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) వెంకటేష్ (Venkatesh)తో చేస్తున్న మూవీ పనుల్లో ఉన్నారు.

కాగా త్రివిక్రమ్ వెంకటేష్ తో చేస్తున్న ప్రాజెక్ట్ కంటే ముందుగా ఎన్టీఆర్ తో మూవీ అనుకున్నారు. చిత్రం టైటిల్ “గాడ్ ఆఫ్ వార్”. ఈసారి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఓ భారీ పురాణాధారిత మైథలాజికల్ డ్రామాగా రూపొందనుంది.

సినిమా కథ యుద్ధ దేవుడైన కార్తికేయ స్వామి గాథ ఆధారంగా సాగనుందనే సమాచారం బయటకు వచ్చింది. దక్షిణ భారతదేశంలో, ముఖ్యంగా తమిళనాడులో కార్తికేయ స్వామి(మురుగన్‌) దేవుడిని యుద్ధదేవుడిగా ఆరాధిస్తారు. అయితే ఆయన దివ్యగాథ ఇప్పటివరకు భారతీయ సినిమాల్లో పెద్దగా చూపించలేదు. ఈ నేపథ్యాన్ని త్రివిక్రమ్ ఒక అన్వేషణాత్మక, భావోద్వేగ భరితమైన మైథలాజికల్ విజువల్ ఎక్స్‌పీరియెన్స్ గా చూపించబోతున్నారని తెలిసింది.

కానీ ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కలేదు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందన్న వార్తలు వచ్చాయి. కారణం — త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా మరో సినిమాను ప్రారంభించడమే.

అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం, “గాడ్ ఆఫ్ వార్” ప్రాజెక్ట్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులేదు. త్రివిక్రమ్ తన వెంకటేష్ చిత్రాన్ని 2026 వేసవికి పూర్తి చేసి, వెంటనే “గాడ్ ఆఫ్ వార్” ప్రీ–ప్రొడక్షన్ పనుల్లోకి వస్తారని తెలుస్తోంది.

అదే విధంగా ఎన్టీఆర్ కూడా “డ్రాగన్” పూర్తి చేసిన వెంటనే “గాడ్ ఆఫ్ వార్” పై దృష్టి పెట్టనున్నాడని సమాచారం.

ఈ మైథలాజికల్ మల్టీస్టారర్ చిత్రం 2027 ఆరంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading