శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై తాజాగా సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తున్న పుకార్లపై నిర్మాత దిల్ రాజు స్పష్టమైన ప్రకటన విడుదల చేశారు. సంస్థకు సంబంధించి ప్రచారం జరుగుతున్న సమాచారంలో ఎటువంటి నిజం లేదని ఆయన ఖండించారు.
“ఈ మధ్య మా బ్యానర్‌పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. అవన్నీ పూర్తిగా నిరాధారమైనవి. ఎప్పుడో వచ్చిన పాత ఊహాగానాలను, ఇప్పటి విషయాలకు ముడిపెట్టి కొంతమంది తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు” అని దిల్ రాజు పేర్కొన్నారు.
ప్రస్తుతం బ్యానర్‌లో అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ బాజ్మీ దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక పనులు జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
“మా నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు ఎలాంటి నిర్ధారణలకు రావద్దని, ధృవీకరించని వార్తలను మీ గౌరవ మీడియా ద్వారా ప్రచారం చేయకుండా ఉండాలని మనవి చేస్తున్నాము” అని దిల్ రాజు స్పష్టం చేశారు.