సినిమా వార్తలు

‘మా ఇంటి బంగారం’ నుంచి ‘తస్సాదియ్యా’ రిలీజ్

Published by
Srinivas

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఇప్పటికే మంచి బజ్‌ను సొంతం చేసుకుంది. సమంత హీరోయిన్‌గా నందినీ రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ఈ అంచనాలను మరింత పెంచగా, తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్‌తో మరో ఆకట్టుకునే అప్డేట్‌ను అందించారు.

‘తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ పాటను పెళ్లి వేడుకల్లో మార్మోగేలా రూపొందించారు. రెహమాన్ సాహిత్యాన్ని అందించగా, చిన్మయి శ్రీపాద, పుణ్య సెల్వ ఆలపించిన ఈ పాటకు సంతోష్ నారాయణన్ క్యాచీ ట్యూన్ ఇచ్చారు. ఉత్సాహభరితమైన బీట్స్, ఫెస్టివ్ వైబ్‌తో ఈ సాంగ్ వెంటనే ఆకట్టుకుంటోంది.

ఈ పాటలో సమంత కనిపించిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆమె ఎనర్జిటిక్ స్టెప్పులు, స్టైలిష్ లుక్స్, క్లాసీ కొరియోగ్రఫీ కలిసి ‘తస్సాదియ్యా’ను పూర్తి విజువల్ ట్రీట్‌గా మార్చేశాయి.

‘ఓ బేబీ’ తర్వాత నందినీ రెడ్డి – సమంత కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో సహజంగానే అంచనాలు పెరిగాయి. దీనికి తోడు రాజ్ నిడిమోరు స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో దిగ్నాథ్, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శ్రీ ముఖి, గౌతమి, ఆనంద్, లక్ష్మీ, శ్రీనివాస్ గవిరెడ్డి, మంజూష తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఫ్యామిలీ మొత్తం కలిసి ఆస్వాదించగల ఎంటర్టైనర్‌గా ‘మా ఇంటి బంగారం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా మే 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts