Download App

ఎల్లమ్మ.. ట్విస్ట్ మీద ట్విస్ట్.. ఫైనల్ గా ఎవరో ?

October 17, 2025 Published by Srinivas

‘బలగం’తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు వేణు ఎల్దిండి, తన రెండో సినిమా ‘ఎల్లమ్మ’ కోసం చాలా కాలంగా సన్నాహాలు చేస్తున్నాడు. కానీ రెండు సంవత్సరాలుగా ఈ సినిమా ఎందుకు మొదలుకాలేదో అని అందరికీ సందేహం. ఇప్పుడు ఆ మిస్టరీకి సమాధానం… హీరో ఎంపికలోనే మొత్తం కథ ఉంది!

మొదట ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత దిల్ రాజు, మొదటగా నాని, తర్వాత తేజ సజ్జ హీరోగా అనుకున్నా, ఒకరి షెడ్యూల్ ఫుల్‌గా ఉండటంతో, మరొకరు పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టడంతో ఫలితం లేకపోయింది.

తర్వాత నితిన్ పేరు ఫిక్స్ అయ్యిందని టాక్ వచ్చింది. అయితే ‘తమ్ముడు’ ఫలితం నిరాశపరిచిన తర్వాత, దిల్ రాజు మరోసారి మనసు మార్చుకున్నారు. ఆ తర్వాత కూడా పలు పేర్లు చర్చలోకి వచ్చాయి. చివరికి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమాను ప్రారంభించబోతున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆయన కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు సమాచారం.

ఇదంతా జరుగుతుండగా, ఇప్పుడు ఒక అసలు ఊహించని ట్విస్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోగా ఎవరనుకుంటున్నారు తెలుసా? అతనే మన డీఎస్పీ — దేవి శ్రీ ప్రసాద్!

అవును, మ్యూజిక్‌తో మాయ చేసిన ఈ స్టార్ కంపోజర్ ఇప్పుడు యాక్షన్‌లోకి దిగబోతున్నాడు. ‘ఎల్లమ్మ’తో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా డెబ్యూ చేయబోతున్నాడన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్.

ఇదే ఆ ఐడియా ఆయన స్నేహితుడు సుకుమార్కు ముందే ఉందని, కానీ అది ఆ సమయంలో సెట్ కాలేదని తెలిసింది. ఇప్పుడు దర్శకుడు వేణు ఎల్దిండి ఆ కలను సాకారం చేయబోతున్నాడని సమాచారం.

దిల్ రాజు ఈ సినిమాను సుమారు ₹70 కోట్ల భారీ బడ్జెట్తో చేయాలని నిర్ణయించుకున్నట్టు టాక్. మరి హీరో ఎవరనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading