సినిమా వార్తలు

‘పరదా’: బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం

Published by
Rahul N

తన కెరీర్‌లోనే అత్యుత్తమ చిత్రం, తన నటనా ప్రస్థానంలోనే గొప్ప పాత్ర అని అనుపమా పరమేశ్వరన్ పరధ గురించి ముందుగానే చెప్పుకొచ్చింది. కానీ విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.

రిలీజ్ అయిన మొదటి రోజే థియేటర్లు వెలవెలబోయాయి. ట్రేడ్ వర్గాలు షాక్ అయ్యే స్థాయిలో కలెక్షన్లు లేవు. ప్రీమియర్ షో నుంచే నెగటివ్ టాక్ రావడంతో, వీకెండ్‌కి కూడా ఎలాంటి రికవరీ అవకాశమే లేకుండా పోయింది.

‘శుభం’తో కనీసం ఓ డీసెంట్ ఓపెనింగ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రభీన్ కన్డ్రేగుల ఈసారి పరదాతో పూర్తి నిరాశను మిగిల్చాడు. ప్రేక్షకులు మొదటి షో నుంచే తిరస్కరించారు.

అనుపమ ఇటీవల వరుసగా హిట్లు అందించింది. కార్తికేయ 2, టిల్లూ స్క్వేర్ వంటి బ్లాక్‌బస్టర్లు ఆమె స్టార్ పవర్‌ను పెంచాయి. అయినప్పటికీ, పరదాకు ప్రేక్షకులను రప్పించలేకపోయింది. కారణం – బలహీనమైన కథ, నిస్సత్తువైన నారేషన్.

దీంతో పరదా మొదటి వారంలోనే బాక్సాఫీస్ నుంచి గల్లంతైంది. ఇటీవల విడుదలైన ఫ్లాప్ సినిమాల జాబితాలో చేరిపోయింది.

ఇక మరోవైపు, ఇతర సినిమాలు కూడా పరిస్థితి మెరుగ్గా లేదు. రజినీకాంత్ కూలీ రెండో వీకెండ్‌కే ఊపును కోల్పోయింది. అలాగే భారీ అంచనాలతో వచ్చిన ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ వార్ 2 కూడా పరాజయాన్ని చవిచూసింది.

Rahul N

Recent Posts