పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG ఉత్తర అమెరికాలో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా ప్రీమియర్ ప్రీ-సేల్స్‌లో 1 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసి, ఆ రికార్డును అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది.
పవన్ కళ్యాణ్‌కి ప్రపంచంలో ఉన్న అఖండ అభిమాన బేస్, ఆయన స్క్రీన్ కరేజ్ ఈ స్థాయి ప్రీ-రిలీజ్ బిజినెస్‌కి ప్రధాన కారణంగా చెప్పుకోవాలి. సినిమా రిలీజ్‌కు ఇంకా 20 రోజులు సమయం ఉన్నా, OG ఇప్పటికే బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యాన్ని చాటేసింది. ప్రతి పోస్టర్, గ్లింప్స్, అప్‌డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, “హంగ్రీ చిరుత”గా పవన్ కళ్యాణ్ లుక్ అభిమానుల్లో అంచనాలను మరింతగా పెంచింది.
రీసెంట్గా రిలీజ్ అయిన Glimpse, Fire Storm, సింగిల్స్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరింత ఊపునిస్తున్నాయి.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హాష్మీ, ప్రియాంక అరుుల్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.
2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న OG, ఇప్పటికే సంవత్సరపు అతిపెద్ద ప్రీ-రిలీజ్ సెన్సేషన్‌గా నిలిచింది. ఉత్తర అమెరికా ప్రూవ్ చేసిన ఈ క్రేజ్‌తో, రిలీజ్ దాకా ఇంకా ఎన్ని రికార్డులు బద్దలవుతాయో చూడాలి.