పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ హారర్ ఫాంటసీ థ్రిల్లర్ చిత్రం “ది రాజా సాబ్”. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలను రేపింది. ప్రభాస్ కొత్త లుక్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ బజ్ క్రియేట్ అయ్యింది.
ఇక ఇటీవలే మేకర్స్ ఒక కీలక అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో సినిమా రాబోయే బాక్సాఫీస్ పోటీలో ప్రధాన ఆకర్షణగా నిలిచే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన మరో వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ది రాజా సాబ్ ట్రైలర్ కట్ పూర్తయిందని, దాంతో వచ్చే అక్టోబర్ మొదటి వారంలోనే ఫస్ట్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ వార్త అభిమానుల్లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే దీనిపై ఆఫీసియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా మేకర్స్ నుంచి రావాల్సి ఉంది.
ప్రభాస్ కెరీర్‌లో ఇది ఓ ప్రత్యేకమైన చిత్రం కానుందనే అంచనాలు ఉన్నాయి. హారర్ – ఫాంటసీ – థ్రిల్లర్ జానర్‌లో ప్రభాస్ తొలిసారి కనిపించబోతుండటం ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు హైలైట్ కానుందనే బలమైన నమ్మకం ఉంది.
ప్రతిష్టాత్మక బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. కాబట్టి ట్రైలర్ వస్తే, ది రాజా సాబ్పై ఉన్న అంచనాలు మరింత ఎత్తుకు చేరడం ఖాయం.