సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన యాక్షన్ డ్రామా ‘కూలీ’ థియేటర్లలో భారీ హంగామా సృష్టించిన తర్వాత, ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సన్నద్ధమవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలో విడుదలై, కేవలం ఒక నెలలోనే ఓటీటీలోకి రానుంది. సెప్టెంబర్ రెండో వారంలో ప్రైమ్ వీడియో లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.
థియేటర్లలో ‘కూలీ’ రూ.500 కోట్లకు పైగా వసూలు చేసినప్పటికీ, మిశ్రమ స్పందననే పొందింది. కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లు నష్టాలు చవిచూశారని టాక్. విమర్శకులు కూడా ఇది లోకేష్ కనగరాజ్ కెరీర్‌లోని బలహీన చిత్రాల్లో ఒకటని అభిప్రాయపడ్డారు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా, రజనీకాంత్ స్టార్ పవర్ collectionsను గట్టిగానే నిలబెట్టింది.
ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో, థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులను సినిమా మరింతగా చేరుకుంటుందని అంచనా. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇప్పటికే ప్రీమియర్‌కు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఖచ్చితమైన రిలీజ్ డేట్ త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.
సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ‘కూలీ’లో రజనీకాంత్ డ్యూయల్ షేడ్స్ రోల్‌లో అలరించారు. అక్కినేని నాగార్జున సైమన్ పాత్రలో మెరువగా, శ్రుతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రలు పోషించారు. సంగీతం అనిరుధ్ రవిచందర్ అందించారు.
కూలీ థియేట్రికల్ రన్ మిశ్రమంగానే ఉన్నప్పటికీ, డిజిటల్ ప్రీమియర్‌తో రికార్డ్ వ్యూవర్‌షిప్ వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.