సినిమా వార్తలు

అమెరికాలో ‘OG’ హవా.. ప్రీవ్యూ చార్ట్‌లలో పైపైకి…

Published by
Srinivas

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం “ఓజీ” ఓవర్సీస్‌లో దూకుడు కొనసాగిస్తోంది. ఉత్తర అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే $4.2 మిలియన్ల వసూళ్లను దాటేసి, ప్రీవ్యూ థర్స్‌డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ సీజన్‌లోనే కాకుండా, ఇటీవలి కాలంలో విడుదలైన తెలుగు సినిమాల మధ్యలో కూడా “ఓజీ” ఓవర్సీస్ బాక్సాఫీస్‌లో ప్రధాన ఆకర్షణగా మారింది.

$1M క్లబ్: గురువారం ర్యాంకింగ్స్‌ ఇలా ఉన్నాయి…

They Call Him OG – $4.2M

One Battle After Another – $3.1M

Demon Slayer – $1.1M

ఇండస్ట్రీ వర్గాలు “ఓజీ” కలెక్షన్ దూకుడును విశ్లేషిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గ్లోబల్ స్టార్డమ్ మళ్లీ రుజువు కావడంతో, ఓవర్సీస్ బాక్సాఫీస్ మొత్తం ఆయన వైపు దృష్టి సారించింది.

భారీ లాభాలు

ఇంతకుముందు కల్కి 2898 AD, పుష్ప 2 లాంటి పెద్ద సినిమాలు ఓవర్సీస్‌లో $15 మిలియన్+ వసూళ్లు సాధించాయి. అయితే అవి భారీ బడ్జెట్, విఎఫ్ఎక్స్ మీద ఆధారపడిన ప్రాజెక్టులు. కానీ “ఓజీ” మాత్రం సరైన లెక్కలతో, ప్రాక్టికల్ వ్యాల్యుయేషన్‌లో డిస్ట్రిబ్యూటర్ల చేతికి వెళ్లింది. పవన్ కళ్యాణ్ అభిమానుల క్రేజ్‌ని బలంగా క్యాష్ చేసుకున్న ఈ చిత్రం, విడుదలైన కొన్ని రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది.

డిస్ట్రిబ్యూటర్ల బ్రేక్-ఈవెన్ పాయింట్‌ $2.5 మిలియన్ల వద్దే మొదలైంది. సినిమా $3 మిలియన్ దాటిన వెంటనే ప్రాఫిట్స్ మొదలైపోయాయి. ప్రస్తుతం $4.2 మిలియన్ల వద్ద ఉండటంతో, రాబోయే వారాల్లో సులభంగా $6 మిలియన్ మార్క్ చేరుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

పవన్ ఫ్యాన్స్‌కి డబుల్ సెలబ్రేషన్

ఈ విజయంతో, “ఓజీ” ఓవర్సీస్‌లో అత్యంత లాభదాయకమైన తెలుగు బిగ్గీగా నిలవనుందన్న అంచనాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ అభిమానులకి మాత్రం ఇది వసూళ్ల కంటే ఎక్కువ – తమ అభిమాన నటుడి అజేయమైన క్రేజ్‌ను అంతర్జాతీయ స్థాయిలో మరోసారి జరుపుకోవడమే.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.