పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ‘ఓజీ’ (OG) విడుదలైన దగ్గర నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. భారీ ఓపెనింగ్స్‌తో మొదలైన ఈ సినిమా, వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టిస్తోంది. ఫ్యాన్స్ నుండి విమర్శకుల వరకు అందరూ ఒకే స్వరంతో సినిమా స్కేల్, సుజీత్ టేకింగ్, పవన్ కళ్యాణ్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను ప్రశంసిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు రాబడుతున్న ఈ యాక్షన్ డ్రామా ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినిమాలలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇలాంటి సమయంలో, సినిమాలో గీతా పాత్రలో కనిపించిన నటి శ్రియారెడ్డి తన ప్రదర్శనతో ప్రత్యేకంగా నిలిచారు. ప్రకాశ్ రాజ్ కోడలిగా, ప్రారంభ భాగంలో ఇరవై నిమిషాల నిడివి గల ఘనమైన ఎపిసోడ్‌లో ఆమె నటన ప్రేక్షకుల మనసులు దోచేసింది. కేవలం చిన్నపాత్రగానే కాదు, సినిమాలో బలమైన ముద్ర వేసే రోల్‌గా గీతా నిలిచిపోయింది.
సినిమాకు వస్తున్న అపారమైన స్పందనతో ఉప్పొంగిపోయిన శ్రియారెడ్డి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దర్శకుడు సుజీత్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ఇలా రాసుకొచ్చారు: “సుజీత్(Sujeeth) రాసిన గీత నాకు గుర్తు చేసింది – తెరపై బలం అనేది తెర వెనుక ధైర్యంతోనే పుడుతుంది. ఇంత పెద్ద స్థాయి సినిమాలో ఒక మహిళను uncompromisedగా, పవర్ ఫుల్ గా నిలబెట్టడం చాలా అరుదు. గీతా పాత్రను నాకిచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఎప్పటికీ మరిచిపోలేని అనుభవం.”
అంతేకాకుండా, సుజీత్ వ్యక్తిత్వం, కష్టాన్ని మరింతగా పొగడ్తలతో ముంచెత్తారు. “నేను ఎప్పుడూ నమ్ముతాను – ఒక మంచి మనిషి అయితే తప్పకుండా గొప్ప విజయాలు వస్తాయి. మీరు అంత స్వచ్ఛమైన, నిజాయితీ గల వ్యక్తి. ఈ విజయం మీకెంతో అర్హత కలది. మీ sheer hard work, faith, మరియు చేసిన త్యాగాలన్నింటికీ ఇది ఫలితం” అని ఆమె అన్నారు.
“ఓజీ” కాకుండా, ఇటీవలే భారీ బ్లాక్‌బస్టర్ అయిన “సలార్”లో కూడా శ్రియారెడ్డి నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. వరుసగా వచ్చిన ఈ విజయాలతో ఆమె కెరీర్ మళ్లీ మలుపు తిరిగినట్టుగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.