Download App

ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’

మార్చి 28, 2026 By Srinivas
మెగా ప్రిన్స్ Varun Tej హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బరి. Niharika Konidela నిర్మిస్తున్న ఈ సినిమాను Yadu Vamsi దర్శకత్వం వహిస్తున్నారు. Pink Elephant Pictures బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి కాగా,...
ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’

మెగా ప్రిన్స్ Varun Tej హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం బరి. Niharika Konidela నిర్మిస్తున్న ఈ సినిమాను Yadu Vamsi దర్శకత్వం వహిస్తున్నారు. Pink Elephant Pictures బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పూర్తి కాగా, వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ చిత్ర ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం Pawan Kalyan ముఖ్య అతిథిగా హాజరై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. Naveen Yerneni కెమెరా స్విచ్ ఆన్ చేయగా, దర్శకుడు Merlapaka Gandhi, నిర్మాత Rajeev Reddy స్క్రిప్ట్ అందజేశారు.

ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’

వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ‘ముకుంద’ తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ గారు తన సినిమా ప్రారంభానికి రావడం ఎంతో ప్రత్యేకమని తెలిపారు. నిహారిక నిర్మాతగా, తాను హీరోగా కలిసి పని చేయడం ఆనందంగా ఉందని, వంశీ చెప్పిన కథపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను అంగీకరించానని చెప్పారు. ఇప్పటికే వాలీబాల్ ప్రాక్టీస్ ప్రారంభించానని, సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నామని వెల్లడించారు.

ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’

నిహారిక కొణిదెల మాట్లాడుతూ, కుటుంబ సభ్యులతో కలిసి సినిమా నిర్మించడం ఎంతో స్పెషల్ అనిపిస్తోందని చెప్పారు. ‘బరి’ గ్రామీణ స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వచ్చే ప్రతి సినిమా నాణ్యతతో ఉండేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’

దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ, వాలీబాల్ నేపథ్యంతో వచ్చిన ఈ కథకు మొదటి ఎంపికగా వరుణ్ తేజ్‌ను భావించానని చెప్పారు. పూర్తి కథ వినిపించగా ఆయనకు నచ్చిందని, త్వరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ హాజరు కావడం తమ యంగ్ టీంకు గొప్ప ప్రోత్సాహమని అన్నారు.

ప్రారంభమైన వరుణ్ తేజ్ ‘బరి’

సంగీత దర్శకుడు Anudeep Dev మాట్లాడుతూ, ఈ చిత్రంలో సంగీతానికి మంచి ప్రాధాన్యత ఉందని, మరింత ప్రభావవంతమైన ఆల్బమ్ ఇవ్వబోతున్నానని తెలిపారు. ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా మాట్లాడుతూ, యంగ్ టీంతో కలిసి పని చేయడం ఆనందంగా ఉందని, ‘బరి’ సంక్రాంతికి పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading