సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ ‘OG’: ‘ఓమి ట్రాన్స్’తో పెరిగిన అంచనాలు

Published by
Srinivas

ఓ వైపు OG ప్రీ రిలీజ్ సేల్స్ అమెరికాలో దూసుకెళ్తోంటే, మరో వైపు అభిమానులకు కొత్త కొత్త గ్లిమ్ప్స్ తో మరింత ఉత్సాహాన్ని పెంచుతోంది టీం.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా వచ్చిన ‘ఓమి’ గ్లిమ్ప్స్ అద్భుతమైన స్పందన వచ్చిన తర్వాత, తాజాగా ‘ఓజీ’ బృందం ‘ఓమి ట్రాన్స్’ పూర్తి వెర్షన్ను విడుదల చేసింది. గంభీరగా పవన్ కళ్యాణ్, ఓమిగా ఇమ్రాన్ హష్మీ మధ్య ఉండబోయే భీకర పోరాటం పై ఈ గీతం రూపొందింది.

తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట ఉరుములు, మెరుపులను తలపించే బీట్స్‌తో అభిమానులను నిజంగానే ట్రాన్స్‌లోకి తీసుకెళ్తోంది. ఇప్పటికే గ్లింప్స్ హిట్ కావడంతో, ఈ గీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

ఇప్పటివరకు విడుదలైన ప్రతి అప్‌డేట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించగా, అభిమానులతో పాటు సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ‘ఓజీ’కి వేరే ప్రచారం అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ చిత్రం 2025లో అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

సుజీత్ దర్శకత్వంలో, డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి తారాగణం కనిపించనున్నారు.

ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ‘ఓజీ’ సెప్టెంబర్ 25, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఓమి ట్రాన్స్’తో ఇప్పుడు బాక్సాఫీస్ గర్జన కౌంట్‌డౌన్ అధికారికంగా ప్రారంభమైంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts