ఇంటర్వ్యూలు

రితికా నాయక్: తేజ చాలా ప్రొఫెషనల్, డెడికేటెడ్

Published by
Srinivas

సూపర్ హీరో తేజ సజ్జ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా విజువల్ వండర్ మిరాయ్ సెప్టెంబర్ 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాకింగ్ స్టార్ మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్రలో కనిపించగా, హీరోయిన్‌గా రితికా నాయక్ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌కు అపారమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా హీరోయిన్ రితికా నాయక్ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.

మిరాయ్‌లో ఎంట్రీ ఎలా జరిగింది?

“నా తొలి సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ తర్వాత ఒక మంచి పాత్ర కోసం ఎదురుచూస్తున్నప్పుడు మిరాయ్ ఆఫర్ వచ్చింది. కథ అద్భుతంగా అనిపించింది. నా పాత్ర నాకు చాలా నచ్చింది. ఈ సినిమా కోసం బాగా హార్డ్‌వర్క్ చేశాం. ఇప్పుడు ఆడియన్స్ ముందు రానుండటం ఆనందంగా ఉంది” అని తెలిపారు.

మీ పాత్ర గురించి?

“నేను ఇందులో హిమాలయాల్లో ఉండే ఒక మాంక్ పాత్రలో కనిపిస్తాను. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. తనలో గ్రేట్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఇంతకుమించి రివీల్ చేయలేను. మిరాయ్లో యాక్షన్ ఫాంటసీ ఎలిమెంట్స్ ప్రేక్షకులకు గొప్ప అనుభవాన్ని ఇస్తాయి” అన్నారు.

తేజ సజ్జాతో వర్క్ అనుభవం?

“తేజ చాలా ప్రొఫెషనల్, డెడికేటెడ్. షూటింగ్ సమయంలో గాయాలు, ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ ఎప్పుడూ టైమ్‌కి సెట్‌లో ఉండేవారు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. మనోజ్ గారు ఆన్‌స్క్రీన్ పవర్‌ఫుల్‌గా, ఆఫ్‌స్క్రీన్ చాలా ఫన్‌గా ఉంటారు. జగపతిబాబు గారు, శ్రీయా గారితో కలిసి పనిచేయడం కూడా అద్భుత అనుభవం” అన్నారు.

జర్నీ చాలెంజింగ్‌గా అనిపించిందా?

“సినిమాలో దాదాపు 80% షూట్ రియల్ లొకేషన్స్‌లో జరిగింది. ప్రతి లొకేషన్ వెరీ చాలెంజింగ్‌గా అనిపించింది. కానీ మా టీమ్ అందరూ సపోర్ట్ చేయడంతో జర్నీ అద్భుతంగా సాగింది” అని చెప్పారు.

డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గురించి?

“ఆయనకు విజన్ చాలా క్లియర్‌గా ఉంటుంది. సెట్‌లో క్లారిటీతో పనిచేస్తారు. ఆయనతో పని చేయడం చాలా ఆనందమైంది. మా ఇద్దరి బర్త్‌డేస్‌కు ఒక్కరోజు గ్యాప్ ఉండటంతో సెట్‌లో అందరూ మమ్మల్ని బ్రదర్–సిస్టర్ అని పిలిచేవారు” అని నవ్వుతూ చెప్పారు.

మ్యూజిక్ గురించి?

“హరి గౌర గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. పాటలు విజువల్‌గా చాలా బాగుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది” అన్నారు.

భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నారు?

“కథలో ప్రాధాన్యత ఉన్న అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నాకు యాక్షన్, రొమాన్స్ జోనర్స్ అంటే చాలా ఇష్టం. హనుమాన్ నా ఫేవరెట్ మూవీ” అని తెలిపారు.

ప్రొడ్యూసర్స్ గురించి?

“పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు చాలా ప్యాషన్ ఉన్నవారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను గ్రాండ్‌గా తీశారు. ఇలాంటి ప్రొడక్షన్ హౌస్‌లో పని చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు.

ఇష్టమైన హీరోయిన్?

“నాకు సాయి పల్లవి చాలా ఇష్టం. ఫిదా చూసి ఫిదా అయ్యాను. ఆమెనే నా ఇన్స్పిరేషన్” అని అన్నారు.

కొత్త ప్రాజెక్ట్స్?

“ప్రస్తుతం వరుణ్ తేజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను. ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి. త్వరలో మేకర్స్ ప్రకటిస్తారు” అని వెల్లడించారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.