సినిమా వార్తలు

‘పెద్ది’ ‘రై రై రా రా’… రామ్ చరణ్ స్టెప్స్‌కు సోషల్ మీడియా ఫిదా… చికిరి రికార్డును దాటి…

Published by
Srinivas

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డాన్స్ అంటే కేవలం స్టెప్స్ కాదు… స్క్రీన్‌ను పూర్తిగా కంట్రోల్ చేసే ఎనర్జీ. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ నుంచి వచ్చిన తొలి సాంగ్ ‘చికిరి చికిరి’ ఇప్పటికే భారీ స్పందన తెచ్చుకుంది. గ్రేస్, పవర్, స్టార్ చారిస్మా కలిసిన ఆ పాట ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

ఇప్పుడు విడుదలైన రెండో సింగిల్ ‘రై రై రా రా’ అయితే అంచనాలను మరింత పెంచుతూ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన వెంటనే ఈ పాటకు అద్భుతమైన స్పందన లభించింది. ఐదు భాషల్లో కలిపి ఈ సాంగ్ ఇప్పటికే 46.1 మిలియన్‌కు పైగా వ్యూస్ మరియు 8 లక్షలకుపైగా లైక్స్ సాధించింది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ మాత్రమే 29.21 మిలియన్ వ్యూస్ సాధించి, గతంలో ‘చికిరి చికిరి’ 24 గంటల్లో సాధించిన 29.1 మిలియన్ వ్యూస్ రికార్డును దాటింది.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ పాటకు ఇచ్చిన మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రా బీట్స్‌తో నిండిన ఎనర్జిటిక్ కంపోజిషన్‌తో పాటు ఆయన స్వయంగా పాడిన పవర్‌ఫుల్ వోకల్స్ ట్రాక్‌కు మరింత జోష్ ఇచ్చాయి. అనంత శ్రీరామ్ తన పదాలతో పాటకు బలమైన భావం, దమ్ము జోడించారు.

స్క్రీన్‌పై రామ్ చరణ్ మరోసారి తన స్టైల్‌ను చూపించాడు. స్వాగ్‌తో పాటు అగ్రెషన్, రిథమ్ కలిపి ఆయన చేసిన డాన్స్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. జానీ మాస్టర్ రూపొందించిన క్లిష్టమైన కొరియోగ్రఫీని చరణ్ ఎంతో ఈజ్‌తో చేసి చూపించడం పాటకు హైలైట్‌గా నిలిచింది.

దర్శకుడు బుచ్చి బాబు సానా తన ప్రత్యేకమైన రస్టిక్ విజువల్ స్టైల్‌తో పాటను గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఎర్తీ టోన్, భారీ ఫ్రేమ్స్‌తో ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా రూపొందించారు.

వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య ‘పెద్ది’ చిత్రం ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

Recent Posts