Download App

కోయంబత్తూరుకు రామ్ చరణ్.. నేడు శస్త్రచికిత్స.. వెంట మెగా ఫ్యామిలీ

జూలై 27, 2026 • By Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోమవారం మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇందుకోసం ఆయన తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకున్నారు. ఇటీవల 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన చరణ్.. సినిమా విడుదల, ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు నొప్పిని భరిస్తూనే తన వృత్తిపరమైన బాధ్యతలను పూర్తి చేశారు. ఇప్పుడు అన్ని...
కోయంబత్తూరుకు రామ్ చరణ్.. నేడు శస్త్రచికిత్స.. వెంట మెగా ఫ్యామిలీ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోమవారం మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకోనున్నారు. ఇందుకోసం ఆయన తమిళనాడులోని కోయంబత్తూరుకు చేరుకున్నారు. ఇటీవల ‘పెద్ది’ సినిమా షూటింగ్ సమయంలో గాయపడిన చరణ్.. సినిమా విడుదల, ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు నొప్పిని భరిస్తూనే తన వృత్తిపరమైన బాధ్యతలను పూర్తి చేశారు. ఇప్పుడు అన్ని పనులు ముగియడంతో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

సమాచారం ప్రకారం, కోయంబత్తూరులోని ప్రముఖ గంగా ఆస్పత్రిలో సోమవారం ఈ శస్త్రచికిత్స జరగనుంది. ఆర్థోపెడిక్ చికిత్సలకు దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ ఆస్పత్రిలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ రాజశేఖర్ నేతృత్వంలోని నిపుణుల బృందం చరణ్‌కు ఆపరేషన్ నిర్వహించనుంది.

ఈ కీలక సమయంలో చరణ్‌కు అండగా నిలిచేందుకు మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, ఉపాసనతో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా కోయంబత్తూరుకు వెళ్లినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ‘పెద్ది’ షూటింగ్‌లోనే చరణ్ మణికట్టుకు గాయమైనప్పటికీ.. సినిమా ప్రమోషన్స్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదనే ఉద్దేశంతో ఆయన శస్త్రచికిత్సను వాయిదా వేసుకున్నారు. అభిమానులతో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొని, సినిమా బాధ్యతలను పూర్తిచేసిన తర్వాతే చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు.

శస్త్రచికిత్స అనంతరం రామ్ చరణ్ కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. ఆ తర్వాత దర్శకుడు సుకుమార్ తెరకెక్కించనున్న తన తదుపరి చిత్రంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాత చిత్రీకరణ ప్రారంభం కానుంది.

ఇప్పటికే ‘రంగస్థలం’ వంటి ఇండస్ట్రీ హిట్‌ను అందించిన రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి గ్రామీణ నేపథ్యంలో కాకుండా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా తెరకెక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక చరణ్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తై, ఆయన త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్‌లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading