రెబల్ స్టార్ ప్రభాస్ మరో బిగ్ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ స్థాయి వార్ డ్రామా చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, గుల్షన్ కుమార్ మరియు భూషణ్ కుమార్ (టి-సిరీస్) వారు సమర్పిస్తున్నారు.
దీపావళి పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని, మేకర్స్ సినిమా నుంచి ఒక కాన్సెప్ట్ పోస్టర్ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్‌లో సినిమాకు సంబంధించిన టోన్, స్కేల్, విజువల్ గ్రాండ్యూర్‌ను సూచించే అద్భుతమైన లుక్ కనిపించింది. ఫ్రేమ్ మొత్తం తుపాకుల గుట్టలతో నిండిపోయి, కొన్ని ఫైర్ అవుతున్నట్లు కనిపించడం యుద్ధరంగంలోని ఉద్రిక్తతను ప్రతిబింబిస్తోంది. మధ్యలో ఒంటరిగా నిలబడి ఉన్న యోధుని సిల్హౌట్… అదే ప్రభాస్, ఒక అజేయ వీరుడిలా కనిపిస్తూ పోస్టర్‌కు అద్భుతమైన ఇంపాక్ట్‌ను ఇచ్చింది.
పోస్టర్‌పై చెక్కిన సంస్కృత శ్లోకం కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది – “సః పార్థః యః పద్మవ్యూహం జితవాన్” (“పద్మవ్యూహాన్ని జయించిన పార్థుడు ఆయనే”) అని రాసి ఉంది, ఇది చిత్రానికి ఆధ్యాత్మికత మరియు వీరరసాన్ని జోడిస్తోంది.
ఈ భారీ చిత్రంలో అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చంద్ర వంటి లెజెండరీ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొత్త హీరోయిన్ ఇమాన్వి ప్రభాస్‌కు జోడీగా నటిస్తోంది.
సినిమా టైటిల్‌కు సంబంధించిన సస్పెన్స్‌ను కొనసాగిస్తూ, టీమ్ ఒక క్లూ ఇచ్చింది… “Decryption Begins on October 22nd” అని. అంటే, ప్రభాస్ పుట్టినరోజు (అక్టోబర్ 23)కు ఒక రోజు ముందే టైటిల్ రివీల్ చేయనున్నట్లు స్పష్టమైంది.
ప్రభాస్ – హను రాఘవపూడి కాంబినేషన్‌పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఆ అంచనాలను మరింత పెంచుతూ, రాబోయే యాక్షన్ ఎపిక్‌కు పర్ఫెక్ట్ గ్లింప్స్ ఇచ్చింది.