మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (Mahatma Gandhi National Rural Employment Guarantee Act). ఇది గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ, పేదరిక సమస్యలను పరిష్కరించడానికి, ప్రతి కుటుంబానికి ఆర్థిక చేయూత కల్పిస్తూ, సంవత్సరంలో కనీసం 100 రోజుల పని, కల్పించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి కుటుంబానికి, 100 రోజులు వేతనం తో కూడిన ఉపాధి కల్పించడం. దీని మూలంగా చెరువులు , కాలువల్లో పూడిక తీయడం, గ్రామాన్ని బాగు చేసుకొనడం, తదితర పనులు తో అందరికీ పని కల్పించి, ఆర్థికంగా చేయూత నివ్వడం తో పాటు వలసలు ను అరికట్టవచ్చు అని ఈ పథకం తీసుకువచ్చారు.
2005లో అమలులోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వయోజనులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.పురుషులు, మహిళలకు సమాన వేతనం ఉంటుంది. మరియు వేతనాలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి.
వ్యవసాయ రంగం పనుల సమయంలో ఆయా పనులు ఉంటాయి…. ఆ పనులు లేని సమయంలో ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి పని కల్పించాలి అనే ధ్యేయం తో రూపొందించిన ఈ పథకం కొందరి పాలిట కల్పవృక్షమైంది.
ఈ ఉపాధి హామీ పథకం అడ్డుపెట్టుకుని లోకల్ గా ఉన్న నాయకులు అడ్డదారులు తొక్కుతూ చేసిన పని నే మరల చేయిస్తూ అవినీతి కి పాల్పడుతున్నారు అని ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. లోకల్ ఉండే అధికారులు అజమాయిషీ కూడా అంతంత మాత్రమే…. ఎందుకంటే వచ్చేది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కాబట్టి… అజమాయిషీ కొరవడింది. వాళ్లు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు.
ఇప్పుడు …. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు మారింది.
VB-G RAM G (Viksit Bharat – Gramin Rozgar & Ajeevika Mission) వికసిత భారత గ్రామీణ రోజగార్ మరియు అజీవిక మిషన్.
ఇప్పుడు ఈ బిల్లులో పేరు మార్పుతో పాటు 100 రోజులు ఉండే పనిదినాలు 125 కి పెంచారు. కేంద్రం : 60% నిధులను ఇస్తే , రాష్ట్రం : 40% నిధులు ఇవ్వాలి అని , లోకల్ అధికారులను బాధ్యులను చేస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రాలకు (NE, హిమాలయ ప్రాంతాలు): 90:10 నిష్పత్తి లో కేటాయిస్తారు. దీని మూలంగా రాష్ట్రాలు కూడా బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తాయి అని కేంద్ర ప్రభుత్వం భావన…
పంచాయతీ లలో ముందస్తు ప్రణాళిక తో పనులు రూపకల్పన… అంటే ఉదా: ప్రతి సంవత్సరం చెరువు పూడికలు ఉండవు కదా…. పనుల స్వరూపంని బట్టి ఇప్పటివరకు, మట్టి పనులు, కాలువలు, రోడ్లు ,నీటి సంరక్షణ ఈ పనులే కాకుండా… కొత్తగా ఆస్తి సృష్టి (Durable Assets), గ్రామీణ మౌలిక వసతులు, స్వయం ఉపాధి, మహిళల కోసం స్వయం ఉపాధి సంఘాల కు ప్రత్యేక అవకాశాలు కల్పిస్తూ …. ఇలా అనేక రకాలుగా ప్రత్యేక పనులు కేటాయిస్తారు.
పనులు లేవు అనకుండా వచ్చిన వారికి, పని అడిగిన వారికి పనులు కల్పించ వలసిన బాధ్యత కూడా లోకల్ అధికారులకే అప్పజెప్పబోతున్నారు. పని కి వచ్చిన వాళ్ళమీద డిజిటల్ పర్యవేక్షణ, 100% డిజిటల్ మస్టర్ రోల్, బయోమెట్రిక్ అటెండెన్స్ ఇలా కట్టడి చేయబోతున్నారు.
దీని మూలంగా అవినీతి తగ్గుతుంది, డబ్బు పొదుపు అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. వ్యవసాయ రంగంలో రైతులకు, కార్మికుల కొరత రాకుండా చూడటం ద్వారా రైతులకు అనుకూలం ఈ పథకం. కార్మికులు వలస బాట పట్టకుండా చూడటం… వలన గ్రామాల్లో పచ్చదనం వెల్లివిరుస్తుంది అని అంటున్నారు… రాజకీయ విశ్లేషకులు.
“వికసిత భారత గ్రామీణ రోజగార్” పల్లెలు వికసిస్తే అందరికీ సంతోషమే గా… అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు.