వార్తలు

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు… ఆగేదెన్నడు?

Published by
Rahul N

బంగ్లాదేశ్ లో మారణ హోమం జరుగుతుంది. సరైన నాయకత్వం లేకపోతే, లేదా రాజు ఏమి జరగనట్లు కళ్ళు మూసుకుంటే ఎక్కడైనా అరాచకత్వం ప్రబలిపోతుంది. దీనికి నిదర్శనం ప్రస్తుత బంగ్లాదేశ్. నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు గా ఉన్నారు. ఆయనను అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ నియమించారు.

షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత యూనస్ ఆగస్టు 2024లో ప్రమాణ స్వీకారం చేసి, దేశాన్ని నడిపిస్తున్నారు. దేశం విడిచిన షేక్ హసీనా కు భారత దేశం ఆశ్రయం ఇచ్చింది. ఆవిడను తమకు అప్పజెప్పాలని బంగ్లాదేశ్ ఒత్తిడి తెస్తుంది భారత్ మీద…. కాని భారత్ ఆ ప్రతిపాదనను నిర్ద్వందంగా తోసిపుచ్చింది.

మహమ్మద్ యూనుస్ ప్రజల్లో నుండి వచ్చిన వ్యక్తి కాదు, అమెరికా చేతిలో కీలుబొమ్మ, ఈయన తన వాచాలత్వం తో చైనా పర్యటన లో భారత దేశం మీద నోరు పారేసుకున్నారు. ప్రభుత్వ ఉన్నత పదవి లో ఉన్న వ్యక్తినే భారత దేశం లోని ఈశాన్య రాష్ట్రాల ను తమ బంగ్లాదేశ్ పరిధిలో చూపిస్తూ ఒక మ్యాప్ ను రూపొందించి విడుదల చేశారు. ఇది మిగతా రాజకీయం గా ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక అవకాశం గా మారింది.

అందులో భాగంగా “ఇంక్విలాబ్ మంచ్” అనే వేదిక ద్వారా షరీఫ్ ఉస్మాన్ హాది … 2026 పిబ్రవరి లో జరగనున్న ఎన్నికలు లో స్వతంత్ర అభ్యర్థి గా పోటీచేయబోతున్నాడు. అతను భారత దేశాన్ని , ఈశాన్య రాష్ట్రాల నుండి వేరు చేసి బృహత్తర బంగ్లాదేశ్ ఏర్పాటు చేస్తానని మీటింగ్స్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు, అదేరోజు సాయంత్రం గుర్తు తెలియని ఆగంతకులు షూట్ చేసి పారిపోయారు. చికిత్స అనంతరం డిసెంబర్ 18 వ తేదీన మరణించాడు. దీనిని ఆసరాగా తీసుకుని కొన్ని ఇస్లామిక్ గ్రూపులు బంగ్లాదేశ్ లో కాల్పులకు, భారతదేశం కారణమని ప్రచారం మొదలు పెట్టాయి. దానితో హిందువులు మీద పడ్డాయి మతోన్మాద శక్తులు, పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐ ప్రోద్బలంతో అల్లర్లు అదుపు తప్పుతున్నాయి.

18 డిసెంబర్ 2025 రాత్రి దీపూ చంద్ర దాస్ అనే 30 ఏళ్ల హిందూ యువకుడుని మహమ్మద్ ప్రవక్త ను దూషించాడు అని నిందారోపణ మోపి దాడికి పాల్పడ్డారు…. నిజానికి అతను పని చేసే సంస్థలో ఇద్దరి మధ్య వచ్చిన చిన్న మాట పట్టింపును మతోన్మాద ఘర్షణ గా మార్చారు….చిలికి చిలికి గాలివాన గా మారిన ఈ సంఘటనతో … మతోన్మాద మూకలు దాడి చేశాయి దానితో అతను అసువులు బాశాడు. అయిన వాళ్ళ కసి తీరక ఒక చెట్టుకు వేలాడ దీసి తగులబెట్టారు. ఈ హృదయ విచారక దృశ్యాన్ని మీడియా సంస్థలు చూపించలేకపోయినాయి. అంత హృదయ విదారకం ఉన్నాయి ఆ దృశ్యాలు…. ఆ కుర్రాడు నేను దూషించలేదు అని చెప్పిన వినే స్థితిలో ఎవరూ లేరు…. తాత్కాలిక ప్రభుత్వ సలహాదారుడే దాదాపు వినే విధంగా లేడు …. ఇక పబ్లిక్ వింటారా….!

ఇప్పటివరకు అంటే షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి…..183 హిందువులు హతమయ్యారని చెప్పారు (గత ఒక సంవత్సరంలో) 1600 మంది హిందువులు గాయపడ్డారని,
219 హిందు మహిళలు అత్యాచారాలకు గురయ్యారని, మరియు వందల సంఖ్యలో బలవంతపు మత మార్పిడులు జరిగినట్లు కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. వేలాది హిందూ గృహాలు, వ్యాపార సంస్థలు , హిందూ దేవాలయాలు దాడులకు గురై నాశనం చేయబడ్డాయని వార్తలు అందుతున్నాయి

పోలీసులు మరియు అధికారులుగా హిందువులను నియమించడం లేదని, ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తుందనీ, బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ హక్కుల కార్యకర్త “దీపాలి మిత్ర” UNHRC (UN Human Rights Council) కి ఇచ్చిన నివేదికలో ముఖ్యమైన అంశాలు ఇవి.

హిందువులు లక్ష్యంగా జరుగుతున్న ఈ దాడులు తో పోలీస్, ప్రభుత్వ యంత్రాంగం సరైన రక్షణ ఇవ్వడం లేదని, బాధితులకు న్యాయం జరగడం లేదని, నేరస్తులు శిక్ష నుండి తప్పించుకుంటున్నారని దీపాలి మిత్ర అంటున్నారు. ఇది సాధారణ ఘర్షణలు కాదు, మైనారిటీలను భయపెట్టే విధానం లో ఇవి సాగుతున్నాయని నివేదికలో తెలిపారు.

ఇక్కడ భారత దేశాన్ని ఎలాగైనా సరే టార్గెట్ చేయాలని చూస్తుంది బంగ్లాదేశ్ ప్రభుత్వం…. సిలిగురి చికెన్ నెక్ నీ తమ అధీనం లోకి తెచ్చుకుంటామని తద్వారా భారత దేశాన్ని ముక్క, ముక్కలుగా చేస్తామని , ప్రగల్భాలు పలుకుతున్న ఈ ఉత్తర కుమారులకు ఏమి చూసుకుని ఆ ధైర్యమో…. ఈ సందర్భంగా భారత దేశం ఏమి చేస్తుందో అని కొన్ని దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

తొందరలోనే అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తున్నారు మన భారతీయులు.

Rahul N