సినిమా వార్తలు

రాజా సాబ్ ట్రైలర్… మరి చూత్తారేంట్రా… పరిగెత్తండి..

Published by
Srinivas

రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న ‘ద రాజా సాబ్’ ట్రైలర్ (The Rajasaab Trailer) ఈరోజు విడుదలైంది. ప్రభాస్ ఫాన్స్ కి 2 రోజుల ముందే దసరా పండగ వచ్చేసింది. మైండ్–బ్లోయింగ్ విజువల్ ఎఫెక్ట్స్, భారీ ప్రొడక్షన్ వాల్యూస్‌తో ఆకట్టుకున్న ఈ ట్రైలర్, ప్రభాస్ కెరీర్‌లో తొలిసారిగా హారర్–ఫాంటసీ జానర్‌లో చేసిన ప్రయత్నంగా నిలుస్తోంది.

ట్రైలర్ ఒక హిప్నాటిస్ట్ మాటలతో మొదలై, హాంటెడ్ హౌస్, ఆత్మల, దెయ్యాల వాతావరణం, ముఖ్యంగా తాత పాత్రలో సంజయ్ దత్ గోస్ట్ ప్రెజెన్స్‌తో సస్పెన్స్ పెంచింది.

హీరోయిన్లుగా నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ గ్లామర్‌తో మెరిశారు. ట్రైలర్‌లో మిస్టిక్ క్రియేచర్స్ కూడా చూపించగా, చివర్లో సిగార్ కాలుస్తూ వృద్ధ వేషంలో ప్రభాస్ – “నేనే రాక్షసుడిని” అని డైలాగ్ చెబుతూ క్లైమాక్స్‌ను చూపిస్తూ అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచేశారు.

మొత్తం మూడు నిమిషాల ట్రైలర్‌లో హారర్, యాక్షన్, రొమాన్స్ కలిపిన ఈ మిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. బోమన్ ఇరానీ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఇప్పటివరకు మాస్ ఎంటర్‌టైనర్స్, యూత్‌ఫుల్ కామెడీలతో పేరుపొందిన దర్శకుడు మారుతి, ఈసారి తన స్టైల్‌ను మార్చి భిన్నమైన స్కేల్, ఎగ్జిక్యూషన్‌తో అందరిని ఆశ్చర్యపరిచారు. మిరాయి వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి. విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ద రాజా సాబ్ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.