నిన్న మొన్నటి వరకు మన ఉత్పత్తుల దిగుమతులపై 25 శాతం, 50 శాతం అంటూ సుంకాలపై సుంకాలు విధించిన అగ్రరాజ్యపు అధ్యక్షుడు ట్రంప్ ఇప్పుడు ఇక సినిమాలపై పడ్డాడు. అది కూడా ఏకంగా 100 శాతం అంట…
తాజాగా ఆయన ప్రకటించిన నిర్ణయం ప్రకారం, ఇకపై అమెరికాలో నిర్మించని విదేశీ సినిమాలపై 100% ట్యాక్స్ తప్పనిసరి కానుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి రానుంది.
అమెరికాలో తెలుగు సినిమాలకు ఉన్న మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప, కల్కి వంటి సినిమాలు అమెరికా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ప్రస్తుతం OG అక్కడ సంచలనాలు సృష్టిస్తోంది.
ప్రతి పెద్ద చిత్రానికి అమెరికా నుండి వచ్చే కలెక్షన్లు బిజినెస్‌కి లైఫ్ లైన్ లాంటివి. ఇప్పుడు ట్రంప్ నిర్ణయం వల్ల టికెట్ రేట్లు అక్కడ డబుల్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు $20 టికెట్, కొత్త ట్యాక్స్ వల్ల $40 లేదా అంతకంటే ఎక్కువ అయ్యే పరిస్థితి. ఫలితంగా తెలుగు సినిమాల మీద బయ్యర్ల రిస్క్ పెరుగుతుంది. చిన్న, మధ్యస్థాయి సినిమాలు అమెరికాలో రిలీజ్ కావడం కష్టసాధ్యం అవుతుంది.
ట్రంప్ వెనుక ఉన్న ఉద్దేశ్యం – అమెరికాలో నిర్మించే హాలీవుడ్ సినిమాలకు ఎటువంటి పోటీ లేకుండా డామినేషన్ పెరగడం. దానివల్ల స్థానిక చిత్రాలకు ఆర్థిక లాభం కలుగుతుంది. విదేశీ చిత్రాలు అధిక ధరలు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి వాటికి డిమాండ్ తగ్గే ప్రమాదం ఉంది.
అమెరికాలో తెలుగు సినిమాల కోసం ప్రత్యేకంగా నడుస్తున్న థియేటర్స్, ఎగ్జిబిటర్స్ ఇప్పుడు పెద్ద సమస్యను ఎదుర్కోనున్నారు. భారీ సుంకం కారణంగా డిస్ట్రిబ్యూటర్లు ముందుకు రావడానికి వెనుకాడవచ్చు. దీంతో థియేటర్స్ లోకల్ కంటెంట్‌పై ఎక్కువ ఆధారపడాల్సి వస్తుంది.
పెద్ద సినిమాలు (The Rajasaab, Mana Shankara Varaprasad Garu, Akhanda2, Peddi) లాంటి ప్రాజెక్ట్స్ అమెరికాలో కలెక్షన్స్‌కి డెంటవ్వడం ఖాయం. అమెరికా మార్కెట్‌లో కలెక్షన్లు తగ్గిపోతే, ప్రి-రిలీజ్ బిజినెస్ కూడా ప్రభావితమవుతుంది. దీని వలన ప్రొడ్యూసర్స్ బడ్జెట్లను మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి రావచ్చు.
బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికా మార్కెట్‌ను కోల్పోతే, డబ్బింగ్ వర్షన్స్, పాన్-ఇండియా డ్రీమ్స్ అన్ని దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే – ఇండియన్ సినిమాలు కొత్త మార్కెట్ల కోసం వెతకాల్సి వస్తుందా?