
యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ తన సక్సెస్ ఫార్ములాను కొనసాగించాడు. ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ సినిమాలతో వరుస హిట్స్ సాధించిన ప్రదీప్ ఇప్పుడు తన తాజా చిత్రం ‘డ్యూడ్’ తో హ్యాట్రిక్ కొట్టాడు. అక్టోబర్ 17న విడుదలైన ఈ సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ హిట్టుగా నిలిచింది.
దీపావళి సీజన్‌లో విడుదలైన ‘డ్యూడ్’ సినిమా తక్కువ రోజుల్లోనే ₹100 కోట్ల వసూళ్లు సాధించి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రదీప్ సరసన హీరోయిన్ గా మమిత భైజు నటించింది. తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ రెండింటిలోనూ ఈ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టించింది. యూత్ ఆడియన్స్‌లో ప్రదీప్‌కు ఉన్న క్రేజ్ ఈ సినిమా విజయానికి ప్రధాన కారణమైంది.
ఇప్పటికే థియేటర్‌లలో దాదాపు రెండు వారాల రన్ పూర్తి చేసుకున్న ‘డ్యూడ్’ ఇంకా మరో రెండు వారాల పాటు స్క్రీనింగ్ కొనసాగించనుంది. ఆ తర్వాత ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సమాచారం ప్రకారం, నవంబర్ 14 నుంచి ‘డ్యూడ్’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానున్నట్లు తెలిసింది.. ఐతే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్లాట్‌ఫామ్ తమ షెడ్యూల్‌లో ‘డ్యూడ్’ కోసం స్లాట్ సిద్ధం చేసిందని తెలుస్తోంది.
థియేటర్లలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలవుతుండటంతో అభిమానులు, యూత్ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
