Download App

‘ENE Repeat’లో మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్.. ఈయన ఎవరబ్బా?

అక్టోబర్ 16, 2026 • By Srinivas
కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ENE Repeat’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర...
‘ENE Repeat’లో మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్.. ఈయన ఎవరబ్బా?

కల్ట్ క్లాసిక్ ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ENE Repeat’ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. మురళీధర్‌గా ఆయన పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన లుక్ ఆసక్తికరంగా ఉంది. “ఏం చేయాలో, ఎలా ఉండాలో అన్నీ ఈయనే చెప్పేలా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మురళీధర్? #ENERepeat విమానంలో అతను ఏమి చేస్తున్నాడు?” అంటూ మేకర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు.

ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018లో విడుదలై యువతకు బాగా కనెక్ట్ అయిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

మొదటి భాగంలో తమ స్నేహం, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నలుగురు స్నేహితులు మరోసారి అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ వివేక్‌గా, అభినవ్ గోమఠం కౌశిక్‌గా, వెంకటేష్ కాకుమాను ఉప్పిగా, శ్రీనాథ్ మాగంటి కార్తీక్‌గా కనిపించనున్నారు. వీరి మధ్య సాగే సరదా సన్నివేశాలు, కొత్త కథాంశం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

తాజాగా మురళీధర్ పాత్రను పరిచయం చేయడంతో ఈ పాత్ర కథలో ఎలాంటి ప్రాధాన్యతను కలిగి ఉంటుందనే ఆసక్తి నెలకొంది. విమాన నేపథ్యంతో మేకర్స్ ఇచ్చిన హింట్ కూడా ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. అయితే మురళీధర్ పాత్ర స్వభావం, కథలో ఆయన చేసే సందడి ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.

ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘ENE Repeat’ ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 19, 2026న థియేటర్లలో విడుదల కానుంది. కల్ట్ క్లాసిక్‌కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading