
గ్రామీణ నేపథ్యంతో హారర్, కామెడీ, యాక్షన్ అంశాలను సమతుల్యంగా మేళవిస్తూ తెరకెక్కిన చిత్రం Rākāsā. ప్రశాంతంగా కనిపించే ఓ ఊరిలో అనూహ్య సంఘటనలు ఎలా అలజడి రేపుతాయి? ఆ అగ్నికీలల్లో దాగి ఉన్న రహస్యం ఏమిటి? అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. మార్చి 1న విడుదల కానున్న టీజర్‌తో ఈ కథ ప్రపంచాన్ని ప్రేక్షకులకు మొదటిసారి పరిచయం చేయబోతున్నారు.
మానస శర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో Sangeeth Shobhan, Nayan Sarika జంటగా నటించారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, అనుదీప్ దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రాజు ఎదురోలు అందించిన విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచాయి.

తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆసక్తిని మరింత పెంచుతోంది. ఒక వైపు పచ్చని పంట పొలాలతో ప్రశాంత వాతావరణం కనిపిస్తుండగా, మరో వైపు మంటల్లో కూరుకుపోయిన ఊరు, భయంతో పరుగులు తీస్తున్న జనాలు—ఇలా రెండు విభిన్న భావోద్వేగాలను ఒకే ఫ్రేమ్‌లో చూపించారు. కథలో ఉండే పలు లేయర్లను టచ్ చేస్తూనే అసలు సస్పెన్స్‌ను దాచిపెట్టడం గమనార్హం. ఏప్రిల్ 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఈ చిత్రాన్ని ప్రముఖ నటి, నిర్మాత Niharika Konidela జీ స్టూడియోస్ సమర్పణలో తన Pink Elephant Pictures బ్యానర్‌పై ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మించారు. కంటెంట్ ఆధారిత చిత్రాలను నిర్మించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నిర్మాతలు, ‘రాకాస’ను కూడా అదే నిబద్ధతతో, ఉన్నత నిర్మాణ విలువలతో రూపొందించారు.
