Download App

సెకండ్ హాఫ్‌లో రాశి ఖన్నా పిచ్చి సర్ప్రైజ్ ఇవ్వబోతోంది: సిద్ధు జొన్నలగడ్డ

అక్టోబర్ 15, 2025 By Srinivas
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ స్టైలిస్ట్-డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ...
సెకండ్ హాఫ్‌లో రాశి ఖన్నా పిచ్చి సర్ప్రైజ్ ఇవ్వబోతోంది: సిద్ధు జొన్నలగడ్డ

స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించిన మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ స్టైలిస్ట్-డైరెక్టర్ నీరజ కోన దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు.

విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్న సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ— “సెకండ్ హాఫ్‌లో ఒక సీన్‌లో రాశి ఖన్నా ఆడియన్స్‌ని పిచ్చి సర్ప్రైజ్ చేస్తుంది. ఆ సీన్ చూసి థియేటర్‌లో ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని ఎదురుచూస్తున్నా. శ్రీనిధి, రాశి ఇద్దరి క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్‌గా రాశారు. వాళ్లకు మించిన స్ట్రాంగ్ క్యారెక్టర్ నాదే ఉంటుంది,” అని తెలిపారు.

సెకండ్ హాఫ్‌లో రాశి ఖన్నా పిచ్చి సర్ప్రైజ్ ఇవ్వబోతోంది: సిద్ధు జొన్నలగడ్డ

అలాగే ఆయన మాట్లాడుతూ— “ట్రైలర్ చూసిన తర్వాత సినిమా బోల్డ్‌గా ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇది ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ. లవ్, లైఫ్, ఫ్యామిలీ రిలేషన్‌షిప్స్‌పై సరికొత్త దృక్కోణంలో డిస్కషన్ ఉంటుంది. ప్రతి సీన్ కొత్తగా అనిపిస్తుంది. ఇది విడుదలైన తర్వాత దీని కోసం ప్రత్యేకమైన జానర్ అని పిలుస్తారు,” అని విశ్వాసం వ్యక్తం చేశారు.

‘తెలుసు కదా’లో తమన్ మ్యూజిక్, జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, నవీన్ ఎడిటింగ్ ప్రధాన బలంగా నిలిచాయని, సినిమా థియేటర్‌లో ఆడియన్స్‌కి “కొత్త ఎక్స్పీరియన్స్” ఇవ్వబోతోందని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ కి మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా అక్టోబర్ 17న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading