Download App

సిద్ధు చాలా సీరియస్‌… నేను చాలా ట్రిగ్గర్ అయ్యాను – రాశి ఖన్నా

అక్టోబర్ 13, 2025 By Srinivas
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ 'తెలుసు కదా' చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అవ్వగా, టీజర్‌కి భారీగా స్పందన లభించింది. తాజాగా విలేకరుల సమావేశంలో హీరోయిన్ రాశి ఖన్నా ఈ సినిమా...
సిద్ధు చాలా సీరియస్‌… నేను చాలా ట్రిగ్గర్ అయ్యాను – రాశి ఖన్నా

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘తెలుసు కదా’ చిత్రంలో శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా హీరోయిన్స్‌గా కనిపిస్తున్నారు. ఇప్పటికే పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అవ్వగా, టీజర్‌కి భారీగా స్పందన లభించింది.

తాజాగా విలేకరుల సమావేశంలో హీరోయిన్ రాశి ఖన్నా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

“ఈ సినిమా చేస్తున్నపుడు చాలా ట్రిగ్గర్ అయ్యాను” అని రాశి ఖన్నా అన్నారు. “నేను చాలా లవ్ స్టోరీస్ చేశాను. కానీ ‘తెలుసు కదా’ చాలా డిఫరెంట్. ఇందులోని కథ, పాత్రలు కొత్త ఎమోషన్‌ను అందిస్తాయి. ఈ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ లవ్, బౌండరీస్ గురించి మాట్లాడుకుంటారు. ఇలాంటి పాయింట్‌తో సినిమా ఇప్పటివరకు నేను చూడలేదు” అని తెలిపారు.

కథ విన్నప్పుడు తనకు చాలా ఎంజాయ్ అయినట్లు చెప్పిన రాశి, “డైరెక్టర్ నీరజ ప్రతి క్యారెక్టర్‌ని అద్భుతంగా రాశారు. మూడు ప్రధాన పాత్రలు బ్యాలెన్స్ చేయడం చాలా టఫ్ పని. నా పాత్ర ‘అంజలి’ నా రియల్ లైఫ్‌కి ఏమాత్రం పోలికలేని ఒక ఎమోషనల్ జర్నీ” అని వివరించారు.

సిద్ధు జొన్నలగడ్డతో వర్క్ చేసిన అనుభవం గురించి మాట్లాడుతూ – “సిద్ధు ఆన్ సెట్‌లో చాలా సీరియస్‌గా ఉంటారు. ప్రతి సీన్‌పై చాలా కేర్ తీసుకుంటారు. ఆయనతో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం” అన్నారు.

సిద్ధు చాలా సీరియస్‌… నేను చాలా ట్రిగ్గర్ అయ్యాను – రాశి ఖన్నా

డైరెక్టర్ నీరజా కోన గురించి మాట్లాడుతూ, “కథ విన్నప్పుడు షాక్ అయ్యాను. అంత యూనిక్ స్క్రిప్ట్ రాయడం సులభం కాదు. నీరజ గారు చాలా నాలెడ్జ్ ఉన్న ఫిల్మ్ మేకర్. ఒక ఎక్స్‌పీరియెన్స్డ్ డైరెక్టర్‌తో వర్క్ చేసినట్లుగా అనిపించింది” అని ప్రశంసించారు.

తమన్ మ్యూజిక్ గురించి ఆమె మాట్లాడుతూ, “తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ప్రతి పాటను పాషన్‌తో చేశారు. ‘మల్లిక గంధ’ పెద్ద హిట్ అయింది” అని అన్నారు.

శ్రీనిధి శెట్టితో తన ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ, “మా కాంబినేషన్‌లో చాలా ఫన్ సీన్స్ ఉన్నాయి. తను చాలా ఫ్రెండ్లీ నేచర్ కలిగిన పర్సన్. మేము మంచి ఫ్రెండ్స్ అయ్యాం” అని రాశి చెప్పారు.

నిర్మాతల గురించి మాట్లాడుతూ, “విశ్వ ప్రసాద్ గారితో ఇది నా రెండవ సినిమా. ఆయన చాలా పాషన్‌తో సినిమాలు చేస్తారు. సినిమాకి కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు” అని అన్నారు.

భవిష్యత్ ప్రాజెక్ట్స్ గురించి రాశి ఖన్నా తెలిపారు — “ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నాను. ఆయనతో వర్క్ చేయడం గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే నాలుగు హిందీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నాను” అని వెల్లడించారు.

ప్రముఖ స్టైలిస్ట్-ఫిల్మ్ మేకర్ నీరజా కోన దర్శకత్వంలో టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading