Download App

‘రాకాస’ దూకుడు… రెండు రోజుల్లోనే ₹10.30 కోట్లు గ్రాస్!

ఏప్రిల్ 6, 2026 By Srinivas
‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దూకుడు కొనసాగిస్తోంది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్‌, నయన్ సారిక జంటగా నటించారు. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి స్పందనను దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఏపీ,...
‘రాకాస’ దూకుడు… రెండు రోజుల్లోనే ₹10.30 కోట్లు గ్రాస్!

‘రాకాస’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ దూకుడు కొనసాగిస్తోంది. మానస శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్‌, నయన్ సారిక జంటగా నటించారు. ఏప్రిల్ 3న విడుదలైన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లోనూ మంచి స్పందనను దక్కించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

ఏపీ, తెలంగాణలో శ్రీలక్ష్మీ నరసింహా మూవీ మేకర్స్ బ్యానర్‌పై విడుదలైన ఈ చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. ప్రారంభం నుంచే డిఫరెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద బలమైన కలెక్షన్లు నమోదు చేస్తోంది. విడుదలైన రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.10.30 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. ముఖ్యంగా శుక్ర, శనివారాల్లో వచ్చిన రెస్పాన్స్ ఆదివారం నాటికి రెట్టింపు కావడం సినిమాకు పెరుగుతున్న క్రేజ్‌ను సూచిస్తోంది. గత 24 గంటల్లోనే 60 వేలకుపైగా టికెట్లు అమ్ముడవడం ఈ చిత్రంపై ఉన్న పాజిటివ్ బజ్‌కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

‘రాకాస’ నుంచి మెలోడీ సాంగ్ ‘పదే పదే’ విడుదల

నిర్మాతలైన నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ కలిసి సినిమాను నిర్మించిన తీరు, దర్శకురాలు మానస శర్మ టేకింగ్, అలాగే నటీనటులు, టెక్నీషియన్స్ పనితీరును ప్రేక్షకులు, సినీ వర్గాలు ప్రశంసిస్తున్నాయి. నిర్మాతగా నిహారిక తన తొలి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’తో బ్లాక్‌బస్టర్ సాధించిన తర్వాత, ఇప్పుడు ‘రాకాస’తో మరో విజయాన్ని అందుకుని తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరిచారు.

సినిమాలో సంగీత్ శోభన్ తన కామెడీ టైమింగ్‌తో మరోసారి ఆకట్టుకోగా, నయన్ సారిక తన గ్లామర్‌తో మెప్పించారు. గెటప్ శ్రీను, బ్రహ్మాజీ తదితరులు అందించిన వినోదం ప్రేక్షకులను అలరిస్తూ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. మొత్తం మీద ‘రాకాస’ కుటుంబ ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించే ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది.

Srinivas

Srinivas is an entertainment journalist covering Telugu cinema, celebrity updates, movie reviews, and OTT news for over 9 years in IndiaGlitz.

View all posts

Trending Now

No trending articles in this category from the last 3 days.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading