సినిమా వార్తలు

‘నారి నారి నడుమ మురారి’ ట్విట్టర్ రివ్యూ: ఇదేం మూవీ రా… నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి…

Published by
Srinivas

శర్వానంద్ హీరోగా , సంయుక్త మరియు సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం నారి నారి నడుమ మురారి సోషల్ మీడియాలో మంచి టాక్ రాబట్టుకుంటోంది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అనిల్ సుంకర మరియు రామబ్రహ్మం సుంకర నిర్మించగా, సంగీతాన్ని విశాల్ చంద్రశేఖర్ అందించారు.

మొదటి షో ముగిసిన వెంటనే నెటిజన్లు ట్విట్టర్ (X) వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. వారి మాటల్లో, సినిమా సినిమా వినోదాత్మకంగా సాగుతూ, సరైన కథనం మరియు చక్కగా అమర్చిన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుందని అంటున్నారు.

హ్యూమర్ చాలా వరకు వర్కౌట్ అయ్యిందని, కామెడీ సీన్స్ సహజంగా పండాయని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా నటుడు నరేష్ తన నటనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, ఆయన కామెడీ టైమింగ్ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

కొన్ని డైలాగులు మరియు సన్నివేశాలు రొటీన్‌కు భిన్నంగా, కొత్తగా అనిపించాయని, అవే సినిమా ఫన్‌ను మరింత బలపరిచాయని ప్రేక్షకులు పేర్కొంటున్నారు.

Srinivas