
చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, బ్లాక్‌బస్టర్ మేకర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్ భోగి తాజాగా కీలక దశకు చేరుకుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు.
1960ల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘భోగి’ ప్రేక్షకులకు ఓ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించనుందని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. ఇప్పటికే విడుదలైన ‘టైటిల్ ఫస్ట్ స్పార్క్’ పవర్‌ఫుల్ కాన్సెప్ట్ వీడియోకు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
తాజా అప్‌డేట్ ప్రకారం, ఈ సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో ప్రారంభమైంది. ఈ కీలక షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌ను చిత్రీకరించనున్నారు. ఇందులో శర్వానంద్ నెవర్ బిఫోర్ పాత్రలో కనిపించనుండటం సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 1960ల ఉత్తర తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంత నేపథ్యంతో, వింటేజ్ సెట్టింగ్‌లో రూపొందుతున్న ‘భోగి’ టెక్నికల్‌గా నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది.
సినిమాకు స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, డీవోపీగా కిషోర్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్‌గా కిరణ్ కుమార్ మన్నె పనిచేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
‘భోగి’ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది. భారీ కాన్సెప్ట్, వింటేజ్ సెట్టింగ్, శర్వానంద్ న్యూ అవతార్‌తో ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందోనన్న ఆసక్తి ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొంది.
