Download App

మొన్న పవర్ స్టార్… నిన్న మెగాస్టార్… మెగా బ్రదర్స్ తో మామూలుగా ఉండదు మరి..

జనవరి 27, 2026 By Suresh Thota
"చిరంజీవి" తెలుగు సినీ జగత్తులో ఎవరెస్టు శిఖరం… ఎందరికో మార్గదర్శి… 1980 నుండి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వెండి తెరపై వెలుగులీనుతూనే ఉంది… తెలుగు వెండి తెరపై ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా… ఆయన ముద్ర శిలా శాసనం. ఒక నటుడ్ని తడితే నాకు చిరంజీవిలా అవ్వాలని ఉంది...
మొన్న పవర్ స్టార్… నిన్న మెగాస్టార్… మెగా బ్రదర్స్ తో మామూలుగా ఉండదు మరి..

“చిరంజీవి” తెలుగు సినీ జగత్తులో ఎవరెస్టు శిఖరం… ఎందరికో మార్గదర్శి… 1980 నుండి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వెండి తెరపై వెలుగులీనుతూనే ఉంది… తెలుగు వెండి తెరపై ఎవరు అవునన్నా… ఎవరు కాదన్నా… ఆయన ముద్ర శిలా శాసనం.

ఒక నటుడ్ని తడితే నాకు చిరంజీవిలా అవ్వాలని ఉంది అంటాడు. ఒక దర్శకుడుని అడిగితే… చిరంజీవితో సినిమా చేయాలని ఉంది అంటాడు. ఒక నృత్య దర్శకుడ్ని అడిగితే… చిరంజీవి పాటకి కొరియోగ్రఫీ చేయాలని, ఒక కళా దర్శకుడుని… అలా అన్ని శాఖల వారికి చిరంజీవి అన్నా, చిరంజీవి సినిమాకి పని చేయడం అన్నా ఒక చిరకాల వాంఛగా ఫీల్ అవుతారు.

Chiranjeevi gift to Anil Ravipudi

అటువంటి చిరంజీవి మొన్న సంక్రాంతి కి అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన “మన శంకర వరప్రసాద్ గారు” బాక్స్ ఆఫీస్ వసూళ్లు మరో స్థాయిలో ఉన్నాయి. ఈ సందర్భంగా చిరంజీవి అనిల్ రావిపూడికి బహుమతి గా “రేంజ్ రోవర్” ని, బహుకరించారు. ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇది చిరంజీవి తన సినిమా హిట్ అయిన ఆనందం తో ఆయన పర్సనల్ గా ఇచ్చారు. మొన్న పవన్ కళ్యాణ్ హీరో గా, సుజిత్ దర్శకత్వంలో వచ్చిన “OG” సినిమాకి, ఆ దర్శకునికి “డిఫెండర్” కారు బహుమతి గా ఇచ్చారు.

Pawan Kalyan gift to Sujeeth

ఈ మెగా బ్రదర్స్ తమ పేరు కి తగ్గట్టుగానే మెగా బహుమతులు ఇచ్చారని… ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. గతంలో హీరో బాలకృష్ణ, సంగీత దర్శకుడు తమన్ కి… మహేష్ బాబు… కొరటాల శివకి, నితిన్… వెంకీ కుడుముల కు కార్లు బహుమతిగా ఇచ్చారు.

సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ ఒక వార్తను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు… రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న “పెద్ది” సినిమా ద్వారా… ఆ చిత్ర దర్శకుడు సానా బుచ్చిబాబుకి… కూడా “కారు” రూపంలో బంపర్ ఆఫర్ రెడీ అని.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading