Download App

ట్రెండింగ్‌లో ‘OG’ నుంచి ‘సువ్వి సువ్వి’… పవర్‌ఫుల్ లవ్ మెలోడి

ఆగస్ట్ 27, 2025 By Rahul N
ఫైర్ స్టార్మ్ తో పవర్ స్టార్ అభిమానుల్ని ఒక ఊపు ఊపేసిన ఓజి ఇప్పుడు సువ్వి సువ్వి అంటూ పవర్‌ఫుల్ మెలోడీ తో మనముందుకొచ్చింది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓజస్ గంభీర పాత్రలో...
ట్రెండింగ్‌లో ‘OG' నుంచి ‘సువ్వి సువ్వి’… పవర్‌ఫుల్ లవ్ మెలోడి

ఫైర్ స్టార్మ్ తో పవర్ స్టార్ అభిమానుల్ని ఒక ఊపు ఊపేసిన ఓజి ఇప్పుడు సువ్వి సువ్వి అంటూ పవర్‌ఫుల్ మెలోడీ తో మనముందుకొచ్చింది. ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఓజస్ గంభీర పాత్రలో పవన్ కళ్యాణ్ ఆకట్టుకోనుండగా, ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు.

ఈ సినిమాకి సంగీత మాంత్రికుడు ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫైర్ స్టార్మ్ వంటి మాస్ నెంబర్ తర్వాత తాజాగా విడుదలైన రెండో పాట ‘సువ్వి సువ్వి’ మాత్రం పూర్తిగా విభిన్నమైన మూడ్‌లో, హృదయాలను హత్తుకునేలా సాగింది. విడుదలైన క్షణాల్లోనే ఈ మెలోడి శ్రోతల మనసులను గెలుచుకుంటూ ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తోంది.

శృతి రంజని ఆలపించిన ఈ పాటను తమన్ అత్యంత ఆత్మీయంగా స్వరపరిచారు. కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని రాసిన సాహిత్యం ఈ గీతానికి మరింత అందాన్ని జోడించింది. ప్రేమ గీతాల విషయంలో ఎందుకు తమన్ ఎప్పటికీ అగ్రగామిగా నిలుస్తున్నారో మరోసారి నిరూపించింది.

విజువల్స్‌లో పవన్ కళ్యాణ్ – ప్రియాంక అరుళ్ మోహన్ జంట చూడ ముచ్చటగా ఆకట్టుకుంటోంది. గంభీరుడైన పవన్ పాత్రకు సమతుల్యం చేస్తూ, కన్మణిగా ప్రియాంక తెరపై కనిపించే తీరు మరింత అందంగా అనిపిస్తోంది. ఈ జంట ఇప్పుడు అభిమానుల్లో పెద్ద ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెమెరా వర్క్‌ను రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస నిర్వహిస్తుండగా, ఎడిటింగ్ బాధ్యతలు నవీన్ నూలి చేపట్టారు. శక్తివంతమైన సాంకేతిక బృందం చేతుల్లో ‘ఓజీ’ ఓ అద్భుతమైన సినిమాటిక్ అనుభూతి ఇవ్వడానికి రూపుదిద్దుకుంటోంది.

ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటైన ‘ఓజీ’ సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్‌డేట్‌ సెన్సేషన్‌గా మారిన ఈ సినిమాలో తాజాగా విడుదలైన ‘సువ్వి సువ్వి’ మెలోడి కూడా అంచనాలను మరింతగా పెంచింది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading