సినిమా వార్తలు

Mirai OTT: బిగ్ ట్విస్ట్ తో OTTలోకి వచ్చేసిన ‘మిరాయ్’

Published by
Srinivas

ప్రపంచవ్యాప్తంగా ₹150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సఫీస్ వద్ద సంచలనం సృష్టించిన మిరాయ్ (Mirai), ఇప్పుడు ఓటిటీ లోకి వచ్చేసింది.

తేజ సజ్జ (Teja Sajja) ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం మిరాయ్(Mirai), కార్తిక్ గట్టమనేని (Karthik Ghattamaneni) దర్శకత్వంలో రూపొందింది. ఈ చిత్రం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూ, బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటించడం కూడా ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ఈ సినిమా ఇప్పుడు జియో హాట్‌స్టార్‌ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో డబ్ చేయబడిన ఈ చిత్రం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. థియేటర్లలో విడుదలైన వెర్షన్‌కి 2 గంటల 49 నిమిషాల నిడివి ఉండగా, ఓటీటీలో విడుదలైన వెర్షన్ మాత్రం 2 గంటల 46 నిమిషాలకు తగ్గించబడింది. అంటే సుమారు మూడు నిమిషాల కంటెంట్‌ను తొలగించారు.

ఇక థియేట్రికల్ వెర్షన్‌లో సంచలన హిట్‌గా నిలిచిన “వైబ్ ఉంది బేబీ” పాట ఓటీటీ వెర్షన్‌లో లేనట్టుగా అభిమానులు గమనించారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ఇప్పటికే చర్చ మొదలైంది. ఏ సీన్ లేదా సీక్వెన్స్‌ను తొలగించారనే అంశంపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు.

హిందీ వెర్షన్‌ విషయానికి వస్తే — అది నవంబర్ నెలలో విడుదల కానుందని సమాచారం. ఓటీటీలో విడుదలకు ముందు మిరాయ్ సినిమా పలు దేశాల్లో అద్భుత రన్‌ సాధించి, ప్రత్యేకంగా యువ ప్రేక్షకుల నుంచి అపారమైన స్పందన తెచ్చుకుంది. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ — అన్నీ కలిపి ఈ చిత్రాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లాయి.

సంగీతం గౌర హరి సమకూర్చగా, ఆయన అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలం అయింది.

విజువల్స్ పరంగా అద్భుతంగా కనిపించే ఈ చిత్రం ఫాంటసీ యాక్షన్ జానర్‌లో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించింది. థియేటర్లో చూసిన అనుభవం తరువాత ఇప్పుడు ఓటీటీ (Mirai OTT)లో కూడా మళ్లీ చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

మొత్తం మీద, తేజ సజ్జ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన మిరాయ్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలో తన మాయను కొనసాగించనుంది.

Srinivas