సంక్రాంతి పండుగ సందర్భంగా భారీ సినిమాల వరుస రిలీజ్‌లతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఈ రేసులో మొదటగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం The Raja Saab. Prabhas హీరోగా నటించిన ఈ హారర్–ఫాంటసీ ఎంటర్టైనర్ ఈ నెల 9వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 8వ తేదీ రాత్రి నుంచే ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి.
ఈ నేపథ్యంలో నిర్వహించిన The Raja Saab Pre Release Party ఈవెంట్‌లో నిర్మాత SKN చేసిన వ్యాఖ్యలు ప్రత్యేకంగా హైలైట్ అయ్యాయి. గతంలో ప్రొడ్యూసర్ T G Vishwa Prasad తన సినిమా మిరాయ్ మంచి రన్‌లో ఉన్నప్పటికీ, ఇతర పెద్ద సినిమాలు OG వంటి వాటికి థియేటర్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇప్పుడు ది రాజా సాబ్ కు కూడా అందరూ సహకరించాలని ఆయన కోరారు. సినిమా విడుదల తర్వాత థియేటర్లు ఇచ్చిన ప్రతి ఒక్కరి పేర్లను బయట పెడతానని, అందులో అందరూ ఉండాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, “ఒక్క థియేటర్ ఇస్తే వందసార్లు చెప్పుకుంటాను… ఇవ్వలేకపోతే రెండువందల సార్లు చెప్తాను… అదే నా నైజం” అంటూ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ మాటలు థియేటర్ యజమానులు, ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇక సినిమాకు సంబంధించిన మరొక కీలక అప్డేట్ కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ది రాజా సాబ్ ఫైనల్ రన్‌టైమ్‌ను 2 గంటలు 52 నిమిషాలుగా లాక్ చేసినట్లు తెలిపారు. ప్రేక్షకులకు ఎంగేజింగ్ అనుభూతి ఇవ్వాలనే ఉద్దేశంతో కంటెంట్‌ను కట్టుదిట్టంగా ప్యాక్ చేశామని యూనిట్ వెల్లడించింది.
భారతదేశంలో పేడ్ ప్రీమియర్ షోలు నిర్వహించేందుకు సిద్ధమైన ఈ చిత్రం, ముఖ్యంగా నైజాం ఏరియాలో రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుంచి ఓపెన్ చేయనున్నట్లు సమాచారం.
దర్శకుడు Maruthi రూపొందించిన ఈ హారర్–ఫాంటసీ ఎంటర్టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్ పవర్, పండుగ సీజన్, ప్రీమియర్ హైప్ అన్నీ కలిసి ది రాజా సాబ్ కు బాక్సాఫీస్ వద్ద గ్రాండ్ ఓపెనింగ్ ఖాయమనే నమ్మకాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.