అన్నామలై బీజేపీ కి అందివచ్చిన పోరాట యోధుడు ,నాయకుడు. ఇంచుమించు ఒక సంవత్సరం రాష్ట్రం లో పాదయాత్ర చేసిన నాయకుడు…. తమిళనాడు ఎన్నికల నేపద్యంలో అన్నామలై ను, దూరం పెట్టారు… బీజేపీ నుండి దూరం జరగలేదు కాని, అన్నాడీఎంకే తో పొత్తు పెట్టుకోవడం ద్వారా బీజేపీ అధిష్టానం నకు అన్నాడీఎంకే చీప్ EPS పెట్టిన మొదటి షరతు ఇదేనని అంటున్నారు… అన్నామలై ను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గా తొలగించడం… తమ పార్టీ తో జరగబోయే మీటింగ్స్ కి ఆయన్ని దూరంగా ఉంచడం… ఇదే ప్రాతిపదికన పొత్తు కుదిరింది అని చెన్నై వర్గాల నుండి అందిన అనధికార సమాచారం. ఇది ఎంతవరకు లాభిస్తుందో ఎన్నికల వేళ వేచి చూడాలి.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 లో BJP మరియు AIADMK కూటమి మధ్య జరిగిన పర్యవసానల మూలంగా, అన్నామలై కు టిక్కెట్ దక్కకపోవడం కూడా బీజేపీ రాజకీయ క్రీడలో భాగమే అంటున్నారు రాజకీయ పండితులు. ఇవి అన్ని తమిళనాట చర్చనీయాంశాలుగా మారాయి. ఏప్రిల్ 23న ఒకే దశలో జరిగే ఎన్నికల్లో DMK మరొక సారి అధికారంలో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, NDA కూటమికి కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ప. బెంగాల్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది బీజేపీ.
తమిళనాడు కంటే పశ్చిమ బెంగాల్ పై ఎందుకు ఎక్కువ దృష్టి పెడుతుంది. గత ఎన్నికల్లో అంటే 2021 అసెంబ్లీ, 2024 లోక్‌సభ BJP కు 38% ఓట్లు వచ్చాయి. (TMC) తృణమూల్ కాంగ్రెస్ తో హోరా హోరీ పోటీ జరుగుతున్నది. 294 సీట్లు ఉన్న ప.బెంగాల్ లో 160 సీట్ల కు పైగా టార్గెట్తో మిషన్ ప.బెంగాల్ ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుంది. అయితే తమిళనాడులో మొత్తం సీట్లు 234. బీజేపీ ఓటు షేర్ 3.6% మాత్రమే, అన్నాడీఎంకే తో పొత్తులో భాగంగా, బీజేపీకి కేటాయించిన సీట్లు 27 మాత్రమే. రెండు దశలలో జరగనున్న ఎన్నికలు ఏప్రిల్ 23, 29 మూలంగా కూటమికి అనుకూలం కావడం వ్యూహాత్మక ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఏప్రిల్ 2న బీజేపీ 27 మందితో అభ్యర్థుల జాబితా ప్రకటించగా, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేరు లేదు. బీజేపీ తో అన్నాడీఎంకే కూటమి పొత్తులో భాగంగా తక్కువ సీట్ల ను కేటాయించింది. ఇంతకుముందు అన్నామలై, మాజీ ముఖ్యమంత్రిలు అయిన జయలలిత, అన్నాదురైల పై విమర్శలు చేసి కూటమి బ్రేక్‌కు కారణమయ్యారు. అన్నాడీఎంకే ఆయన ను బీజేపీ చీఫ్ పదవి తొలగించమని షరతు విధించింది అని సమాచారం. అయినా “అన్నామలై” ప్రచారం చేస్తాను అని స్పందించారు.
ఇక్కడ ఇంకొక విషయం ఉంది. బీజేపీ అంత తొందరగా ఏ విషయం ఒప్పుకోదు. కాని తమిళనాడు లో అన్నాడీఎంకే షరతులకు ఒప్పుకుంది అంటే… దీని వెనుక పది సంవత్సరాల ప్లాన్ ఉండి ఉంటుంది. ఇప్పుడు తమిళనాడు మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవచ్చు… పెట్టదు కూడా… గెలిస్తే మంచిదే… గెలవకపోయినా మరీ మంచిది. ఎందుకంటే పొత్తులో భాగంగా ఇప్పుడు ఏమి మాట్లాడరు. గెలిస్తే ఇంకొక 5 సంవత్సరాల ప్లాన్ లేటు అవుతుంది అంతే, కూటమి ఓడిపోతే కనుక…. అన్నామలై… అన్నాడీఎంకే నీ ఒక ఆట ఆడుకుంటాడు. కాని కూటమిలో బీజేపీకి కేటాయించిన సీట్ల మీద ఎక్కువగా ఫోకస్ చేసి సాధ్యమైనంతవరకు సీట్లను గెలిపించుకు వస్తాడు. ఇది కూడా ఒకరకమైన రాజకీయమే… నెమ్మదిగా అన్నాడీఎంకేలో నాయకత్వ లేమి లక్షణాలను అందరూ తప్పు పడుతూ, EPS కు నిద్రపట్టనివ్వరు. శశికళ కూడా దాడి చేయడం మొదలు పెడుతుంది. ఇలా అన్నాడీఎంకేలోని నాయకులకు ప్రత్యామ్నాయంగా బీజేపీ కనపడుతుంది. మీ పార్టీలో ఆ నాయకుడ్ని తీసేయండి అంటే పక్కకు పెట్టేయడానికి మిగతా పార్టీల వంటిది కాదు బీజేపీ… కార్యకర్తల్ని, కష్టపడేవారిని ఎన్నటికీ వదులుకోదు.
అన్నాడీఎంకేలోని నాయకులకు బీజేపీ మాత్రమే కనపడుతుంది. ఎందుకంటే… విజయ్ పార్టీని ఎంత బద్నాం చేయాలో అంతా చేసేసారు. ఇప్పుడు వీళ్ళు అందరూ… బీజేపీతో కలసి , బీజేపీ సారధ్యంలో 2029 జరిగే జమిలి ఎన్నికల కు సమాయత్తం అవుతారు. అప్పుడు బీజేపీ అసలు రూట్ మ్యాప్ తమిళనాడు ప్రజలకు, నాయకులకు అర్ధం అవుతుంది.