Download App

ట్రంప్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ వెతలు…

ఫిబ్రవరి 25, 2026 By Suresh Thota
"నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు" అనే సామెత డోనాల్డ్ ట్రంప్ కు, పాకిస్తాన్ ప్రధాని కి సరిపోతుంది ఏమో… డోనాల్డ్ ట్రంప్ నిన్న అమెరికా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికి ఒకసారి అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ ముందుకు వచ్చి దేశ పరిస్థితులు,...
ట్రంప్ వ్యాఖ్యలతో పాకిస్తాన్ వెతలు…

“నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు” అనే సామెత డోనాల్డ్ ట్రంప్ కు, పాకిస్తాన్ ప్రధాని కి సరిపోతుంది ఏమో…

డోనాల్డ్ ట్రంప్ నిన్న అమెరికా పార్లమెంట్ ను ఉద్దేశించి ప్రసంగిస్తూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సంవత్సరానికి ఒకసారి అమెరికా అధ్యక్షుడు కాంగ్రెస్ ముందుకు వచ్చి దేశ పరిస్థితులు, విదేశాంగ విధానం, భద్రతా అంశాలు తదితర విషయాలపై మాట్లాడే అధికారిక ప్రసంగంలో భారత్ మరియు పాకిస్తాన్ యుద్ధం గురించి ప్రస్తావించారు.

ఆ వ్యాఖ్యలు పాకిస్తాన్ ను మరోసారి ఇరకాటంలో పడేశాయి. ఆ వ్యాఖ్యలు ఏమిటంటే… “నా తొలి 10 నెలల్లోనే నేను ఎనిమిది యుద్ధాలను ముగించాను… భారత్ మరియు పాకిస్తాన్ మధ్య అణు యుద్ధం జరిగి ఉండేది. 3.5 కోట్ల మంది ప్రాణాలు పోయేవి… నా జోక్యం లేకపోయి ఉంటే పాకిస్తాన్ ప్రధాని కూడా మరణించి ఉండేవారు.” అని చెబుతూ…. “నేను జోక్యం చేసుకోకపోయి ఉంటే 3.5 కోట్ల మంది చనిపోయేవారని పాకిస్తాన్ ప్రధానే నాకు చెప్పారు.” అని చెప్పడంతో పాకిస్తాన్ కి అంతర్జాతీయంగా ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు.

ఈ క్షణం వరకు కూడా భారత ప్రభుత్వం ఈ యుద్ధాన్ని ఆపింది అమెరికా అని ఎక్కడా ప్రస్తావించలేదు. లెక్కించలేనన్ని సార్లు ఒక అగ్ర దేశ అధ్యక్షుడు అయ్యి ఉండి కూడా ట్రంప్ నేనే ఆ యుద్ధాన్ని ఆపాను అని చెప్పడం, ప్రపంచ వ్యాప్తంగా ట్రంప్ ను ఈ వ్యాఖ్యలు నవ్వుల పాలు చేశాయి… చేస్తున్నాయి కూడా. మన ప్రధాని మోడీ సాక్షాత్తు పార్లమెంట్ లో పాకిస్థాన్ ప్రాధేయపడితేనే మేము యుద్ధం ఆపాము కాని, ఏ దేశ ఒత్తిడి మా మీద లేదు అని ప్రకటించారు.

అయినా సరే నేనే ఆపాను అంటున్న డోనాల్డ్ ట్రంప్ ను… మనకు KA పాల్ ఉన్నట్లుగా, అక్కడ ట్రంప్ ఉన్నాడు…. ఒక్కటే తేడా అతను అధికారంలో ఉన్నాడు… ఇక్కడ ఈయన లేడు అంతే… మిగతాదంతా సేమ్ టు సేమ్ అప్పా… అని సినిమా స్టైల్ చెప్పడం…. గమనార్హం.

సోషల్ మీడియాలో నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అందులో ఒక నెటిజన్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

“ఇందులో నువ్వు ఆపటం అబద్ధం, ఆ రోజు మేము ఆపి ఉండకపోతే వాడు పోయుండేవాడు అనేది నిజం. ఇలా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ మాత్రం నోరు మెదపడం లేదు.

Suresh Thota

సురేష్ తోట ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్. సినిమా, రాజకీయాలు మరియు సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక వ్యాసాలు రచించడం ఆయన ప్రత్యేకత. సమకాలీన పరిణామాలపై లోతైన అవగాహనతో, వాస్తవాధారిత దృక్కోణంలో పాఠకులకు స్పష్టమైన, సమగ్ర సమాచారాన్ని అందించడం ఆయన రచనా శైలిలో ప్రధాన లక్షణం.

View all posts

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading