ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను తన తొలి నిర్మాణంగా తెరకెక్కించిన ‘పంచనామా’ విజయంపై భావోద్వేగానికి గురయ్యారు. తన తొలి ప్రొడక్షన్‌కు ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ఆదరణను చూసి ఆమె కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. ఈ సందర్భంగా ఆమె ప్రయాణం, పడిన కష్టం, ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చాయి.
‘కష్టపడ్డ వారికి ఎప్పటికైనా ఖచ్చితంగా ఫలితం ఉంటుంది’ అనే మాటను ఉదయభాను మరోసారి నిజం చేశారని చిత్ర బృందం పేర్కొంది. ‘పంచనామా’ విజయం ఆమెకు కేవలం ఒక సినిమా సక్సెస్ మాత్రమే కాకుండా, ఎంతోకాలంగా చేసిన కష్టానికి దక్కిన ఫలితంగా నిలిచింది.
తొలి నిర్మాణంతోనే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడం పట్ల ఉదయభాను ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె భావోద్వేగానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ‘పంచనామా’ ZEE5 Teluguలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ చిత్రాన్ని ఓటీటీలో కూడా ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.
నటిగా, యాంకర్‌గా ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉదయభాను.. ఇప్పుడు నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని విజయవంతంగా ప్రారంభించారు.