సినిమా వార్తలు

లిటిల్ హార్ట్స్ పై విజయ్ దేవరకొండ ట్వీట్

Published by
Rahul N

మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో–హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్ ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ తో, రిలీజ్ అయిన అన్ని చోట్లా మంచి టాక్ పొందుతూ, మొదటి రోజు నుంచే దూసుకు పోతోంది.

ఈ సందర్భంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందించారు. తనకు ఇష్టమైన టీమ్ ఈ చిత్రానికి పనిచేసిందని పేర్కొంటూ, “లిటిల్ హార్ట్స్ సినిమా అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను తప్పక చూస్తానని విజయ్ తెలిపారు.

ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలను బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్వర్తించారు.

ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే లిటిల్ హార్ట్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Rahul N

Recent Posts