Download App

లిటిల్ హార్ట్స్ పై విజయ్ దేవరకొండ ట్వీట్

సెప్టెంబర్ 5, 2025 • By Rahul N
మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో–హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్ ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ తో, రిలీజ్ అయిన అన్ని చోట్లా మంచి టాక్ పొందుతూ, మొదటి రోజు నుంచే దూసుకు పోతోంది. ఈ...
లిటిల్ హార్ట్స్ పై విజయ్ దేవరకొండ ట్వీట్

మౌళి తనూజ్, శివానీ నాగరం హీరో–హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం లిటిల్ హార్ట్స్ ఈ రోజు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రివ్యూస్ తో, రిలీజ్ అయిన అన్ని చోట్లా మంచి టాక్ పొందుతూ, మొదటి రోజు నుంచే దూసుకు పోతోంది.

ఈ సందర్భంగా స్టార్ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో స్పందించారు. తనకు ఇష్టమైన టీమ్ ఈ చిత్రానికి పనిచేసిందని పేర్కొంటూ, “లిటిల్ హార్ట్స్ సినిమా అందరి హృదయాలను గెలుచుకోవాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను తప్పక చూస్తానని విజయ్ తెలిపారు.

ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సాయి మార్తాండ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు, 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఇక థియేట్రికల్ రిలీజ్ బాధ్యతలను బన్నీ వాస్, వంశీ నందిపాటి నిర్వర్తించారు.

ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే లిటిల్ హార్ట్స్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Discover more from IndiaGlitz Telugu

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading