Vijay Deverakonda పుట్టినరోజు సందర్భంగా Rowdy Janardhana చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో భారీ చర్చకు దారితీసింది. పోస్టర్‌లో విజయ్ దేవరకొండ మాస్, రగ్గ్డ్ లుక్‌లో కనిపించగా.. హీరోయిన్ Keerthy Suresh తో ఉన్న రొమాంటిక్ మూమెంట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
వర్షంలో తడిసిన విజయ్ ఓపెన్ షర్ట్‌తో కనిపిస్తుండగా.. కీర్తి సురేష్ అతని ఛాతిపై కాలు పెట్టి కనిపించడం పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ విజువల్ చూస్తుంటే సినిమాలో ప్రేమకథ చాలా ఇంటెన్స్‌గా ఉండబోతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇక పోస్టర్‌పై ఉన్న “ప్రపంచంతో పోరాడే మనిషి… ప్రేమ ముందు మాత్రమే తలవంచుతాడు” అనే క్యాప్షన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా కీర్తి సురేష్ పాత్ర కథలో కీలకంగా ఉండబోతుందనే హింట్ ఇస్తోంది.
ఈ చిత్రాన్ని Ravi Kiran Kola తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆయన రూపొందించిన Raja Vaaru Rani Gaaru మంచి ప్రశంసలు అందుకుంది.
స్టార్ ప్రొడ్యూసర్ Dil Raju తన Sri Venkateswara Creations బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంగీతాన్ని Christo Xavier అందిస్తున్నారు.
ఒక్క పోస్టర్‌తోనే ‘రౌడీ జనార్ధన’ సినిమాపై భారీ హైప్ క్రియేట్ కాగా.. విజయ్ దేవరకొండ కొత్త అవతార్, రొమాంటిక్ యాంగిల్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఈ చిత్రాన్ని 2026 డిసెంబర్‌లో భారీ స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు